Share News

Peddapalli: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ దందాకు సూత్రధారి కోరుకంటి చందరే

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:07 AM

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌ఫీఎల్‌ దందాకు ప్రధాన సూత్రధారి మాజీఎమ్మెల్యే కోరుకంటి చందరేనని, తనను సబ్‌ కాంట్రాక్టర్‌గా చిత్రీకరించారించి బలిపశువును చేశారని, నేనే పెద్ద బాధితున్ని అని గోపగోని మోహన్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Peddapalli:  ఆర్‌ఎఫ్‌సీఎల్‌ దందాకు సూత్రధారి కోరుకంటి చందరే

నన్ను క్యాషియర్‌గా వాడుకున్నారు.. నేను పెద్ద బాధితున్ని

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితుల సొమ్ముతో గోదావరి ఒడ్డున 18ఎకరాలు కొన్నారు

పీడీ యాక్టు పెడతామని బెదిరించి నాతో రూ.3కోట్లు కట్టించారు

సిట్‌ విచారణ కోరుదాం... ఎవరు దొంగో తేలుతుంది...

విలేకరుల సమావేశంలో గోపగోని మోహన్‌గౌడ్‌

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌ఫీఎల్‌ దందాకు ప్రధాన సూత్రధారి మాజీఎమ్మెల్యే కోరుకంటి చందరేనని, తనను సబ్‌ కాంట్రాక్టర్‌గా చిత్రీకరించారించి బలిపశువును చేశారని, నేనే పెద్ద బాధితున్ని అని గోపగోని మోహన్‌గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం గోదా వరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కోరు కంటి చందర్‌పై తీవ్రఆరోపణలు చేశారు. కోరుకంటి చందర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన బినామీ సంస్థ శంకుచక్రకు ఫైవ్‌స్టార్‌ నుంచి సబ్‌ కాంట్రాక్టు ఇప్పించా డని, తన చుట్టూ ఉన్న వారిని దళారులుగా పెట్టుకుని ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పనులు పెట్టిస్తానని కోట్ల రూపాయలు వసూలు చేయించాడన్నారు. తనను సబ్‌ కాంట్రాక్టర్‌గా చిత్రీకరించి క్యాషియర్‌గా వాడుకున్నాడని, తన వద్దకు వచ్చిన డబ్బులను తీసుకెళ్లి గోదావరి ఒడ్డున 18 ఎక రాలు కొన్నారన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితుల సొమ్ము తోనే ఆ భూమి కొన్నారని, తాను రూ.3కోట్లు ఇచ్చాన న్నారు. ఈ భూమి కొనుగోలుకు తన డబ్బులు తీసు కెళ్లారని, కొంతనగదుగా, మరికొంత ఆన్‌లైన్‌లో పంపాన న్నారు. అందులో అవకతవకలు ఉన్నాయని తప్పుకు న్నానన్నారు. రెండేళ్లు వరుసగా వరదలతో భూమి ముంపునకు గురై ఇబ్బందులు తలెత్తాయన్నారు. తాను తిరుమల శంకు చక్రకు, భూమికి డబ్బులు పంపానన్నారు.

ముంజ హరీష్‌ అనేవ్యక్తి చందర్‌ బంధువులకు డబ్బులు ఇచ్చాడని, అతడు ఎవరో తనకు తెలియదన్నారు. అతడు చనిపోతే బంధు వులను తప్పించి తనను కేసులో ఇరికించారని, అలాగే నోరు మెదుపుతానని మరికొన్ని కేసులు పెట్టించార న్నారు. తన కుటుంబ మంతా చందర్‌ కాళ్లపై పడితే కానీ తనకు బెయిల్‌ రాలేదన్నారు. తన వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీ రికార్డుల్లో పెట్టలే దని, ఫోన్‌లో డాటా కూడా తొలగించారన్నారు. కానీ డైరీకి సంబంఽధించిన జిరాక్స్‌లు తన వద్ద ఉన్నా యన్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తరు వాత పీడీ యాక్టు పెడతామని బెదిరించి అఖిలపక్షం పేర తనతో రూ.3.5కోట్లు కట్టిం చారని, తనసొంత ఆస్థులు అమ్మి కట్టానన్నారు. ఒక సమయంలో వేధిం పులు భరించలేక ఆత్మహత్య చేసుకుందా మనుకు న్నానన్నారు. గోదావరి ఒడ్డున కొన్న భూమి ఫర్మ్‌లో చందర్‌ కొడుకు పేరు, ఇతరుల పేరు ఉందని, కానీ ఎన్నికలైన 45రోజులకు పేర్లు మారాయన్నారు. ఇటీవల గోదావరి ఒడ్డున భూమి అమ్మారని డబ్బులు అడిగితే తనపైకి చందర్‌ అతని అనుచరులను పంపుతున్నాడ న్నారు. మంత్రి వద్దకు వెళ్లి సిట్‌ వేయమని కోరుదా మని, చందర్‌ దొంగనో, మోహన్‌గౌడ్‌ దొంగనో తేలుతుం దన్నారు. తాను రోడ్డుపైకి వచ్చానని, ఇక వెనక్కి తగ్గేది లేదని, ఏ విచారణకైనా సిద్ధమన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితుల సొమ్ముతో కొన్నభూమి అమ్మా రని, ఇప్పుడు తనకు, బాధితులకు డబ్బులు వాపసు ఇవ్వాలని, లేక పోతే హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌ ముందే నిరసనకు దిగుతానన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:07 AM