Peddapalli: రోగులతో కిటకిటలాడుతున్న ఖని జనరల్ ఆసుపత్రి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:38 AM
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): వాతావర ణంలో మార్పుతో వ్యాధులు పెరిగిపోవడంతో గోదావరి ఖని ప్రభుత్వ జనరల్‌ఆసుపత్రి రోగులతో కిటకిటలాడు తోంది.
పెరుగుతున్న జ్వరపీడితులు
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): వాతావర ణంలో మార్పుతో వ్యాధులు పెరిగిపోవడంతో గోదావరి ఖని ప్రభుత్వ జనరల్‌ఆసుపత్రి రోగులతో కిటకిటలాడు తోంది. రెండురోజులుగా ఓపీ సంఖ్య భారీగా పెరిగింది. సోమ, మంగళవారాల్లో 2400ఓపీ నమోదయ్యింది. ఇందులో ఎక్కువగా జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగాఉంది. వాంతులు, విరేచనాలతో వస్తు న్న వారిసంఖ్య కేసులుకూడా భారీగా నమోదవుతున్నా యి. మంగళవారం వివిధ విభాగాల్లో 1000కేసులు నమోదయ్యాయి. అడ్మిషన్ కేసులు కూడా భారీగా వస్తుండడంతో కొత్తబిల్డింగ్‌లోని బెడ్లు రోగులతో నిండి పోయాయి. ఓపీవిభాగాల వద్ద రోగులు బారులుతీరి కనిపించారు. రెండురోజులుగా ప్రభుత్వాసు పత్రికి రోగుల తాకిడి పెరిగింది. వాతావరణంలో రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండడంతో శ్వాసకోశ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఆస్తమా, లంగ్స్ ఇన్ఫెక్షన్‌కు గురై ఆసుపత్రి చేరుతున్నారు. నిన్నమొన్నటి వరకు చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. డయేరియా కేసులు కూడా అధికం గానే నమోదవుతున్నాయి.