Share News

Peddapalli: ఎరుకల కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:23 AM

ముత్తారం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ముత్తారం మండల కేంద్రంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కేతిరి సారయ్య, ఎల్లమ్మల ఎరుకల కుటుం బాన్ని రామాలయం పేరుతో వెలివేయడం అన్యాయమని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Peddapalli: ఎరుకల కుటుంబానికి న్యాయం చేయాలి

ప్రజా సంఘాల డిమాండ్‌

ముత్తారం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ముత్తారం మండల కేంద్రంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కేతిరి సారయ్య, ఎల్లమ్మల ఎరుకల కుటుం బాన్ని రామాలయం పేరుతో వెలివేయడం అన్యాయమని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్లు బొప్పని పద్మ, అంబాల శారద, రాష్ట్రకమిటీ సభ్యురాలు లోకిని స్వరూప, మొగుళోజు శారద, జిల్లా నాయ కులు బాధిత కుటుంబం నివాస స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో మాజీసర్పంచ్‌ వెంకట్రావు ఇచ్చిన నాలుగు గుంటల స్థలంలో ఈ పేద కుటుంబం గుడిసె వేసుకుని పందులను కాచు కుంటూ జీవిస్తోందని తెలిపారు. అయితే, ఇటీవల రామాలయ నిర్మాణం పేరుతో కొంతమంది గ్రామపెద్దలు ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి వెళ్లగొ ట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో వీరి గుడిసెను తగులబెట్టడం వల్ల కొన్ని పందులు సజీవ దహనమయ్యాయని, ఆ ఘట నపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కులం అనే వివక్షతో వారిని గ్రామం నుంచి వెలివేసే ప్రయత్నం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి అదేస్థలంలో ఇంది రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గొరటటంక్రల సురేష్‌, కేపీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:23 AM