Peddapalli: ' జైల్ భరో విజయవంతం : సీఐటీయూ
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:20 AM
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 10 (ఆంఽధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం అనుస రిస్తున్న కార్మిక, రైతు,ప్రజావ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా నిర్వహిం చిన జైల్‌భరో కార్యక్రమం
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 10 (ఆంఽధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం అనుస రిస్తున్న కార్మిక, రైతు,ప్రజావ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా నిర్వహిం చిన జైల్‌భరో కార్యక్రమం విజయవంతం అయ్యిందని సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డ్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతం రాజీవ్‌రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అనం తరం సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఐఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష్షుడు ఐ కృష్ణా, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్, రైతుసంఘం జిల్లాకన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లా డుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టంచేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తెచ్చిందని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, ప్రజావ్యతిరేకవిధానాలను బీజేపీప్రభుత్వం విరమించు కోవాలని డిమాండ్‌చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయకూలీలను కలుపుకొని ఆందోళనలను చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లాసహాయ కార్య దర్శులు జి జ్యోతి సీపెల్లిరవీందర్, తాండ్ర అంజయ్య, ఎండీ ఖాజా, జిల్లాకమిటీ సభ్యులు రామలక్ష్మి, లచ్చయ్య, రాజమల్లు, భారతి, శ్రీని వాస్, నాగయ్య, దొడ్లరాజబాబు, నరేష్, రమేష్, రామస్వామి, అంబాల లక్మన్, నాయకులు అశోక్, రాజేశం, తిరుపతి, లింగమూర్తి, బాలకృష్ణ, సృజన్ పాల్గొన్నారు.
కార్మిక, రైతు సంఘాల జేఏసీ రాస్తారోకో
గోదావరిఖని, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జైల్‌భరో సందర్భంగా కార్మిక, రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రాజీవ్‌రహదారిపై సోమవారం రెండుగంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్య క్షుడు ఎస్ వీరయ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్రనాయకులు ఈ నరేష్, రైతు సంఘం నాయకులు గుమ్మడి వెంకన్న, ఎం మల్లయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల, కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నదన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రలో బీజేపీ మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధా నాలు, కార్పొరేట్ అనుకూల విధానాలను మానుకోవాలని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో కార్మిక, రైతుసంఘాల నాయకులు టీ రాజిరెడ్డి, చిలుక శంకర్, వేల్పుల కుమారస్వామి, జూపాక శ్రీనివాస్, ఎం దుర్గయ్య, రామాచారి, జీ రాజన్న, లక్ష్మారెడ్డి, ఎస్ రాజేశ్వర్, రావు, బిక్షపతి, ఎస్ ప్రసాద్, కే ధర్మేందర్, పోగుల శేఖర్, శోభన్ బాబు, రాజేశం, శేఖర్, బత్తుల రాజయ్య పాల్గొన్నారు.