Share News

Peddapalli: ఎన్టీపీసీలో కొనసాగిన జేఏసీ నిరసనలు

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:33 AM

జ్యోతినగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ యాజమాన్యం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కాంట్రాక్టుకార్మికుల నిరసనలు బుధ వారం కొనసాగాయి.

 Peddapalli:   ఎన్టీపీసీలో కొనసాగిన జేఏసీ నిరసనలు

జ్యోతినగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ యాజమాన్యం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కాంట్రాక్టుకార్మికుల నిరసనలు బుధ వారం కొనసాగాయి. జేఏసీ ఆధ్వర్యంలో ప్లాంట్‌ గేట్‌2 వద్ద ఉదయం కార్మికులు విధులను బహిష్క రించి పెద్దఎత్తున నిరసన తెలపారు. కార్యక్రమంలో సీఐయూటీ జిల్లా కార్యదర్శి ముత్యంరావు పాల్గొని న్యాయమైన డిమాండ్లకు తమ మద్దతు ప్రకటిం చారు. 2018అగ్రిమెంట్‌లో చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం పూర్తిగా తుంగలో తొక్కిందని ఆరోపించారు. కాంట్రాక్టర్‌ మారినప్పుడల్లా పీవీసీ వేధింపులు ఎందుకని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఇక్కడే నమ్మకంగా పని చేస్తున్న కార్మికులపై ప్రతిసారి పోలీస్‌ వెరిఫికేషన్‌ పేరుతో కొత్త ఆంక్షలు దేనికని అన్నారు. ఇలా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని లేనిపక్షంలో తమపార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కార్మికసంఘాల నాయకులు చిలుకశంకర్‌, నాంసాని శంకర్‌, గిట్ల లక్ష్మారెడ్డి, భూమల్ల చందర్‌, భారీసంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం కార్మిక జేఏసీతో మధ్యాహ్నం సంప్రదింపులు జరుపగా ఈనెల17న మరోసారి చర్చ లు జరిపేందుకు నిర్ణయం జరిగినట్లు వారు పేర్కొ న్నారు. కాగా జేఏసీ నాయకు లతోపాటు ఎన్టీపీసీ ఏజీఎం సాగర్‌ రంజాన్‌సాహూ, అధి కారులు ప్రవీణ్‌చౌదరి, పాఠక్‌ అభిషేక, కాంట్రాక్టర్లు నారాయణ, దాడి శ్రీనివాస్‌, రాజేశం, చందా రాధాకిషన్‌రావు, సోమిరెడ్డి పాల్గొన్నారు.

ఫ రైస్‌మిల్లు ఆపరేటర్ల

వేతన ఒప్పందం చేయాలి

- సీఐటీయూ జిల్లాకార్యదర్శి ముత్యంరావు

సుల్తానాబాద్‌ : రైస్‌మిల్లులో పనిచేస్తున్న ఆప రేట్లకు సంబంధించిన వేతన ఒప్పందాన్ని నిర్ణయిం చాలని సీఐటీయూ జిల్లాకార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు డిమాండ్‌ చేశారు. సుల్తానాబాద్‌ బుధవారం జరిగిన రైస్‌మిల్‌ ఆపరేటర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేటర్లవేతన ఒప్పందరం మే16, 2026తో ముగిసిందని, వెంటనే నూతన వేతనఒప్పందం అమలుకోసం చర్చలు జరపాల న్నారు. నెలరోజుల కిందటే డిమాండ్‌ నోటీస్‌ ఇస్తే ఇప్పటివరకు రైస్‌మిల్లర్లు స్పందించలేదన్నారు. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈనెల15న సమ్మె నోటీస్‌ఇస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో యూనియన్‌ అధ్యక్షుడు తాండ్రఅంజయ్య, ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, స్వామి, రవీందర్‌, ప్రసాద్‌, సదయ్య, లింగయ్య, సుధాకర్‌రావు, మల్లేష్‌, పర్వతాలు, శీను, రాజేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:33 AM