Peddapalli: విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలకమైన దశ
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:34 AM
సుల్తానాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్ర జ్యోతి): ఇంటర్‌మీడియట్ అనేది విద్యార్థి దశలో చాలాకీలకమైనదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
- ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్ర జ్యోతి): ఇంటర్‌మీడియట్ అనేది విద్యార్థి దశలో చాలాకీలకమైనదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ వయసులో చంచల స్వభావం నెలకొంటుందని, ఈ పరిస్థితిలో విద్యార్థులు గట్టి నిర్ణయం తీసుకుని ఉన్నత భవిష్యత్తు వైపు అడుగులు వేయాలన్నారు. సుల్తానా బాద్ ప్రభుత్వ జూనియర్‌కళాశాల వార్షికో త్సవ సభ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఒక గొప్పచరిత్ర ఉందని, ఇందులో చదువుకున్న వారు ఎంతో మంది ఉన్నత స్థానాలను చేరుకున్నారని అన్నారు. మీరు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థానాలను అధిరోహించి గతచరిత్రను తిరగరాయాలని అన్నారు. ఈ కాలేజీలో చదువుకున్న బిరుదు రాజమల్లు ఎమ్మెల్యే అయ్యారని, తానుకూడా ఇదే కాలేజీలో చదువుకుని రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. తాను ఈ కాలేజీ పూర్వ విద్యార్థినేనని కాలేజీ అభివృద్దికి శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు.
ఫ సుల్తానాబాద్ మహిళాడిగ్రీ
కళాశాల భవనానికి రూ.15కోట్లు
ప్రభుత్వ మహిళా డిగ్రీకళాశాలను ప్రస్తుతం అద్దెభవనంలో నిర్వహిస్తున్నా రని, ఈకళాశాలకు శాశ్వతభవనం కోసం రాష్ట్రప్రభుత్వం రూ.15కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. వచ్చే విద్యాసంవ త్సరానికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుం దన్నారు. అలాగే కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ హైస్కూల్ భవనం నిర్మాణం కొనసాగుతోందన్నారు. కళాశాలకు చెందన పెద్ది యువతేజ తైక్వాండో కరాటే పోటీలలో రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాదిం చగా ఆయనను ఎమ్మెల్యే అభినందించారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శిం చిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంచంద్రరెడ్డి, హైస్కూల్ హెచ్‌ఎం రత్నాకర్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ కల్పన, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్ ావు, సొసైటీ మాజీచైర్మన్ శ్రీగిరిశ్రీనివాస్, కౌన్సి లర్లు పాల్గొన్నారు.