Share News

Peddapalli: ఉపాధికోసం ట్రాక్టర్లు వినియోగిస్తున్న వారికి ఇందిరమ్మ బిల్లులు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:27 AM

పెద్దపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం ట్రాక్టర్లు వినియోగిస్తున్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించేందుకు మినహా యింపు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

Peddapalli:  ఉపాధికోసం ట్రాక్టర్లు వినియోగిస్తున్న వారికి ఇందిరమ్మ బిల్లులు ఇవ్వాలి

- ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం ట్రాక్టర్లు వినియోగిస్తున్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించేందుకు మినహా యింపు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన ఇందిరమ్మ ఇళ్ల్ల అంశంపై ప్రసం గించారు. గతంలో 2004నుంచి 2014వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు, మధ్య తరగతి కుటుంబాలకు ఇంది రమ్మ ఇళ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభు త్వానిదేనని అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని చెప్పి 10సంవత్సరాల పాటు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి విడతగా ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేసింద న్నారు. ఇందులో 4.5లక్షల ఇండ్లలో 25శాతం పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ప్రగ తిలో ఉన్నాయని చెప్పారు. అయితే బేస్‌మెంట్‌ పూర్తి చేసు కున్న కొంతమంది లబ్ధిదారు లకు సాంకేతిక ఇబ్బందుల వల్ల బిల్లులు చెల్లింపులో ఇబ్బందు లు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌3 కేటగిరిలో లబ్ధిదారులకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు కేవలం సిమెంటు డ్రా చేసుకున్న వారికి, ఉపాధి కోసం ట్రాక్టర్లు వాడుతున్న వారికి బిల్లులు రావడం లేదన్నారు. ఆయా నిబంధనలను సవరించి బిల్లులు చెల్లించే విధంగా మినహాయించాలని విజయరమణారావు ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Mar 26 , 2026 | 12:27 AM