Share News

Peddapalli: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:45 AM

గోదావరిఖని, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గం లోని అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ హామీ ఇచ్చారు.

Peddapalli:  అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

- రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గం లోని అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ హామీ ఇచ్చారు. జంగాలపల్లికి చెందిన నిరుపేద మహిళలు గురువారం రామగుండం ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. తమకు ఉండేందుకు ఇళ్లు లేవని గతంలో సీపీఎం ఆధ్వర్యంలో స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పంది స్తూ అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఇటీవల 1700 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, నియోజకవర్గంలో ఇళ్లు లేని సుమారు 11వేల మంది పేదలను అర్హులుగా గుర్తించినట్టు తెలిపారు. వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తు న్నట్టు మక్కాన్‌సింగ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:45 AM