Peddapalli: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:40 AM
పెద్దపల్లి టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.
- పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లిపట్టణంలోని 6,7,8,9,12,26,27, 28,29వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఇళ్లమంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం బందంపల్లి ఫ్లైఓవర్‌వద్ద రాజీవ్‌రహ దారిపై ఏర్పాటుచేసిన హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ అధికారులు, మాజీ కౌన్సి లర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు వార్డుల ప్రజలు పాల్గొన్నారు.