Share News

Peddapalli: అక్రమంగా బండరాళ్ల తరలింపు..

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:37 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) ఎలాంటి వే బిల్లులు లేకుండానే పదిహేను రోజు లుగా కొందరు అక్రమంగా లారీల్లో పెద్దఎత్తున బండ రాళ్లను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువ య్యారు.

 Peddapalli: అక్రమంగా బండరాళ్ల తరలింపు..

- 15 రోజులుగా కొనసాగుతున్న రవాణా

- నందిమేడారం టూ కన్నాల

- ఎలాంటి వేబిల్లులు లేకుండానే దర్జాగా రవాణా

- ప్రభుత్వాదాయానికి రూ.50నుంచి 70లక్షల వరకు గండి

- చోద్యం చూస్తున్న అదికార యంత్రాంగం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎలాంటి వే బిల్లులు లేకుండానే పదిహేను రోజు లుగా కొందరు అక్రమంగా లారీల్లో పెద్దఎత్తున బండ రాళ్లను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువ య్యారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి 50నుంచి 70 లక్షల రూపాయల వరకు గండిపడింది. జిల్లాలో గల ధర్మారం మండలం నందిమేడారం శివారులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆరవ ప్యాకేజీలో అండర్‌ టన్నెల్‌ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. టన్నెల్‌ నిర్మించే సమయంలో మట్టితోపాటు పెద్దపెద్ద బండరాళ్లను బ్లాస్టింగ్‌ చేసి బయట కుప్పలుకుప్పలుగా పోశారు. అదే సమయంలో సంబంధిత కాంట్రాక్టర్లు అక్కడ క్రషర్లు ఏర్పాటు చేసుకుని బండరాళ్లను కంక రగా మార్చి ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించుకు న్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఐదేళ్లు పూర్తి కావ స్తున్నది. అప్పటినుంచి కొంతమంది క్రషర్ల యజమా నుల కన్ను ఆ బండరాళ్ల కుప్పలపై పడింది. ఆయా క్రషర్లకు గుట్టల నుంచి బండరాళ్ల సరఫరా లేనప్పుడు ఈ కుప్పల నుంచి బండరాళ్లను తోడుకుని అక్రమంగా తరలించుకు వెళుతున్నారు. మధ్యమఽధ్యలో గనులు భూగర్భ శాఖాధికారులు కొన్ని లారీలను పట్టుకుని జరిమానాలు కూడా విధించారు. ఇక్కడినుంచి బండ రాళ్లను తీసుకవెళ్లాలంటే నీటి పారుదలశాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది గనులు, భూగర్భ శాఖకు సీనరేజీపన్ను చెల్లించి వేబిల్లులు తీసుకోవాల్సి ఉంటుం ది. వేబిల్లులతో బండరాళ్లను నిర్ణీత ప్రదేశానికి రవాణా చేసుకోవాలి. కానీ 15రోజులనుంచి నందిమేడారం టన్నెల్‌ సమీంపలో బండరాళ్ల కుప్పనుంచి పెద్దఎత్తున కన్నాలకు బండరాళ్ల కుప్పలను అక్రమంగా తరలిస్తున్నా రని సమాచారం. మూడు పొక్లెయిన్లను పెట్టి 40టన్నుల సామర్థ్యం గల 20నుంచి 25లారీల్లో రోజుకు 100 ట్రిప్పు లకు పైగా బండరాళ్లను క్రషర్లకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 1400నుంచి 1500లారీల ట్రిప్పుల బండ రాళ్లను తరలించినట్లు తెలుస్తున్నది.

పొద్దంతా, రాత్రంతా తరలిస్తున్నారని తెలుస్తున్నది. 50నుంచి 60వేలటన్నులకు పైగా బండరాళ్లను తరలించినట్లు సమాచారం. ఒక్కో టన్ను కు సీనరేజీ పన్ను 78రూపాయలు, డీఎంఎఫ్‌టీ, జీఎస్టీ, ఇతర పన్నులు కలిపి ఒక్కోటన్నుకు 120రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుం ది. కానీ ఎలాంటి వేబిల్లులు లేకుండానే దర్జాగా అక్రమంగా బండరాళ్లను కన్నా లలోని పలు క్రషర్లకు తరలిస్తున్నారని సమాచారం. ఈ అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి 60నుంచి 70 లక్షల రూపాయల వరకు గండి కొట్టి నట్లు తెలుస్తున్నది. అధికారపార్టీ నాయ కుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటికైనా సదరు అధికారులు స్పందించి బండరాళ్ల అక్రమ రవాణాను నిలిపివేసి ఇప్పటివరకు తరలించిన బండరాళ్లపై సీన రేజీ పన్నులను వసూలు చేయాలని ధర్మారం ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ గనులు భూగర్భశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా గతంలో కూడా అక్రమంగా బండ రాళ్లను తరలిస్తే జరిమానాలు విధించామన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:37 AM