Share News

Peddapalli: అక్రమ మట్టి దందాను అరికట్టాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:21 AM

పెద్దపల్లి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగు తున్న అక్రమ మట్టిదందాను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 Peddapalli:  అక్రమ మట్టి దందాను అరికట్టాలి

- మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో

పెద్దపల్లి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగు తున్న అక్రమ మట్టిదందాను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్‌పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదు ట రాజీవ్‌రహదారిపై ప్లకార్డులతో రాస్తారోకో నిర్వహిం చి ధర్నా చేశారు. ఈసందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటినుంచి నియోజకవర్గంలో అక్రమదందాలు అడ్డగోలుగా సాగుతున్నాయన్నారు. ఎండాకాలం రాగా నే నియోజకవర్గంలోని పలుగ్రామాల చెరువుల్లో ఇటుకబట్టీల కోసం మట్టిమాఫియా చెలరేగి పోతోందని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం క్యూబిక్‌మీటర్ల లెక్కన అనుమతులు ఇవ్వా ల్సింది పోయి, అధికారులు టిప్పర్ల లెక్కన అడ్డ గోలుగా పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. అధికారుల అండ దండలతో ఒక్క రసీదుపైనే పదుల సంఖ్యలో 12,16,20టైర్ల భారీ టిప్పర్లతో 40నుంచి 50టన్నుల ఓవర్‌లోడ్‌తో, అతివేగంగా నడ పడంవల్ల పంచాయతీ రోడ్లన్నీపూర్తిగా చిద్రమైపోతు న్నాయన్నారు. ఫలితంగా ప్రభుత్వ ధనం లక్షల రూపాయల్లో వ్యర్థం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపొలాలకు ఉపయోగపడాల్సిన బంగా రం లాంటి మట్టిని ఇటుక బట్టీల నిర్వాహకులకు అప్పగిస్తుంటే.. ఇరిగేషన్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మైనింగ్‌ శాఖల అధికారులు కళ్లప్పగించి చూస్తూ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం,మొక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై విచారణజరపాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌నాయకులు రఘు వీర్‌సింగ్‌, ఉప్పురాజ్‌కుమార్‌, తిరుపతిరెడ్డి, మోహన్‌ రావు, సందీప్‌రావు, కొయ్యడసతీష్‌గౌడ్‌, గుణపతి, పెంచాలశ్రీధర్‌, వెన్నంరవీందర్‌, రాజకొమురయ్య, నిదా నపురం దేవయ్య, మార్కులక్ష్మణ్‌, సలేంద్ర రాములు యాదవ్‌, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, బైరెడ్డి రాంరెడ్డి, బాలసాని ఈశ్వర్‌గౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:21 AM