Share News

Peddapalli:తప్పుడు పత్రాలతో.. అక్రమ పట్టా

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:12 AM

సుల్తానాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా పట్టా చేయించుకోవడమే కాకుండా 11ఎకరాల 23 గుంటల స్థలాన్ని ఒకవాణిజ్య బ్యాంకులో తనఖాపెట్టి రుణాలు

 Peddapalli:తప్పుడు పత్రాలతో.. అక్రమ పట్టా

సర్కారు భూమి ప్రైవేట్‌ వ్యక్తుల పరం

మూడు గ్రామాల ప్రజల అందోళన

సుల్తానాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా పట్టా చేయించుకోవడమే కాకుండా 11ఎకరాల 23 గుంటల స్థలాన్ని ఒకవాణిజ్య బ్యాంకులో తనఖాపెట్టి రుణాలు కూడా తీసుకున్నారు. రుణాలు తీసుకున్న వ్యక్తి సక్రమంగా సకాలంలో రుణం చెల్లించని సంద ర్భంలో బ్యాంకు వారు తనఖా పెట్టన భూమికి సంబంధించిన స్థలంలో బ్యాంకువారు బోర్డు పాతారు. ఈ స్థలం బ్యాంకుకు చెందినదని రాశారు. దీంతో ప్రభుత్వభూమిలో బ్యాంకువారు బోర్డు పెట్టడం ఏమి టని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆరా తీయగా అసలువిషయం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే..

సుల్తానాబాద్‌ మండలంలోని కనుకుల గ్రామపరి ధిలోని సర్వే నంబర్‌ 221లో వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిఉంది. ఈ భూమిలో కనుకుల, రామునిపల్లి, తొగర్రాయి తదితర గ్రామాల ప్రజల అవసరాలైన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఈ గ్రామాల రైతుల పశువుల మేతకోసం ఇతర అవసరాల నిమిత్తం ఉపయోగించుకుంటున్నారు. అనేక దశాబ్ధాల తరబడి ఇది ప్రభుత్వ భూమి గానే రికార్డులలో నమోదై ఉంది. కానీ గతంలో పట్వారీగా పనిచేసిన వ్యక్తి ఇందులో కొంత భూమిని ఒక ప్రైవేట్‌వ్యక్తి పేరిట రికార్డులో నమోదు చేయించాడని, ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వుల ద్వారా ఇతనికి సంక్ర మించేలా చేయలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇదేసర్వే నంబర్‌లో 11ఎకరాల 23గుంటలు ఉదయ రాజు లలితాబాయి పేరిట ఉండగా ఆయన నుంచి గతంలో తొగర్రాయి గ్రామసర్పంచ్‌గా పని చేసిన వ్యక్తి పేరిట పట్టా చేయించుకున్నారు. ఆయన నుంచి ప్రస్తుతం జిన్న శ్రీలత పేరిట పట్టామార్పిడి జరిగింది. ఈ విషయం ఈ పట్టామార్పిడి గురించి గ్రామస్తులకు అసలు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ప్రస్తుత సర్పంచులు గానీ ప్రజాప్రతి నిధులకు గానీ తెలియదు.

ఓ బ్యాంకువారు తనఖా పెట్టన భూమికి సంబం ధించిన స్థలంలో బోర్డుపాతారు. ఈ స్థలం బ్యాంకుకు చెందినదని రాశారు. దీంతో ఈ ప్రభుత్వ భూమిలో ఈ బ్యాంకువారు బోర్డు పెట్టడం ఏమిటని గ్రామ స్తులు ప్రజాప్రతినిదులు ఆరా తీయగా అసలు విష యం బట్టబయలైంది. సర్వేనంబర్‌ 221లోని ప్రభుత్వ భూమిలో కొంతభాగాన్ని అక్రమంగా పట్టా చేయించు కున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తు లు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందు కు వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తెచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను రెండు సారు,్ల ఇతర ఉన్నతాధి కారులు, తహసీల్దార్‌ చుట్టూ తిరుగుతూ జరిగిన అక్రమాన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఇది కచ్చితంగా అధికారుల సహకారంతోనే జరిగిందని తగిన విచారణ జరిపి ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు పట్టా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ జరిగిన తప్పును సరి చేయండి

- కర్రె కవిత కుమార్‌, సర్పంచ్‌ కనుకులు

ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారు. ఇది అధికారుల సహకారం లేనిదే జరగదు. ఈ తప్పును మళ్ళీ అధికారులే సరి చేయాలి లేదంటే తాము గ్రామస్తులతో కలసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశాము. ఆర్డీఓ తహసిల్దార్‌ను అనేక సార్లు కలిశాము ఇంత వరకు ఏం స్పందన లేదు. గ్రామస్తులు అగ్రహం తో ఉన్నారు.

ఫ అక్రమంగా పట్టా చేయించుకున్నారు..

- సబ్బని రాయమల్లు, రామునిపల్లి

కనుకుల రామునిపల్లి గ్రామాల ప్రజల రైతుల అవసరాలు తీరుస్తున్న ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారు. తాతల కాలం నుంచి అదిప్రభుత్వ భూమిగానే ఉంది. రికార్డులను మార్చి తమ పేర్లు రాయించుకుని కోట్ట విలువ అయిన ప్రభుత్వ భూమిని కాజేసే యత్నం చేశారు. ఇందులో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే వారి పై చర్యలు తీసుకోవాల్సిందే

ఫ ముదిరాజ్‌లకు పట్టాలు ఇచ్చారు

- చుక్క మొగిలి ముదిరాజ్‌ సంఘ నాయకులు

గతంలో ఈ సర్వే నంబర్‌లో దాదాపు ఐదు ఎకరాలు తమ గ్రామానికి చెందిన పేద ముదిరాజ్‌ కులస్తుకలు పట్టాలు ఇచ్చారు. అయితే గ్రామస్తులు ఇదిగ్రామ అవస రాలు తీర్చే భూమిఅని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తమకు పట్టాలు ఉన్నా గ్రామస్తుల అందరికోసం వాటిని వదిలేశాం. అలాంటిది ఇతరులకు అక్రమంగా కాజేస్తే తాము చూస్తూ ఊరుకోం.

ఫ విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..

- బషీరొద్దిన్‌, తహసీల్దార్‌, సుల్తానాబాద్‌

సర్వే నంబర్‌ 221కు సంబందించి గ్రామస్తులు ప్రజా ప్రతినిదులు పిర్యాదు చేశారు. పలుసార్లు కలిసి వివరిం చారు. ఈ మేరకు విచారణ జరిపి న్యాయం చేస్తాం. పట్లా ఎలా చేయడం జరిగిందో రికార్డులు పరిశీలిస్తు న్నాము. అక్రమంగా పట్టా చేసుకున్నట్లుగా తేలితే వాటిని రద్దు చేయడానికి సిఫారసు చేస్తాం.

Updated Date - Jun 01 , 2026 | 01:12 AM