Peddapalli: ఇళ్ల మంజూరు.. నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:48 AM
గోదావరిఖని, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు.. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గాం అధికారులకు, సర్పంచ్‌లకు సూచించారు.
సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు.. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గాం అధికారులకు, సర్పంచ్‌లకు సూచించారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే అంతర్గాం మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో అంతర్గాం మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా గ్రామీణ మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్, కాలువల నిర్మాణం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా, సమయపాలనతో పూర్తిచేయాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, అంతర్గాం మండల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేయండి..
కోల్‌సిటీ: రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదేశించారు. శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థలో సింగరేణి, మున్సిపల్, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలవద్ద తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భధ్రతపై ఆయన అధికారులతో చర్చించారు. ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా అన్నిశాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమీక్షలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీమేయర్ పాతపెల్లి ఎల్లయ్య, ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్, ఈఈ రామన్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి పాల్గొన్నారు.