Share News

Peddapalli: ఘనంగా హోలీ సంబరాలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:45 AM

కోల్‌సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సి పల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ప్రధానచౌరస్తాలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

 Peddapalli:   ఘనంగా హోలీ సంబరాలు

కోల్‌సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సి పల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ప్రధానచౌరస్తాలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మేయర్‌ మహంకాళిస్వామి, డిప్యూటీమేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, వివిధపార్టీల నాయకులు ఈ సంబ రాల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుని శుభా కాంక్షలు తెలుపుకున్నారు. నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మహంకాళిస్వామి మాట్లాడుతూ చిన్నపెద్ద తేడా లేకుండా కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ప్రజలతో మమేకమై పనిచేస్తుందన్నారు. రామగుండం నగరం 2029 నాటికి సకల సౌకర్యాలతో సంపూర్ణంగా అభివృద్ధిచెందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పనిచేస్తున్నారన్నారు. ఈ సంబరాల్లో నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు దూళికట్ట సతీష్‌, గట్ల రమేష్‌, ముస్తాఫా, దాసరి సాంబమూర్తి, వడ్లూరి రవి, కర్రావుల డేవిడ్‌ రాజ్‌, చిదురాల నాగరాజు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌, యైుటింక్లయిన్‌కాలనీ అధ్యక్షుడు గుండేటి రాజేష్‌, నాయకులు గడ్డం శ్రీనివాస్‌, గంగ శ్రీనివాస్‌, బొమ్మక రాజేష్‌, కంకణాలు రాజు, హరి ప్రసాద్‌, కన్నూరి శంకర్‌, సహజ రాజేందర్‌ పాల్గొన్నారు.

వ్యాపార సంఘాల

ఆధ్వర్యంలో..

గోదావరిఖని లక్ష్మీనగర్‌ లోని బులియన్‌ మార్కెట్‌లో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, వ్యాపారసంఘాల ఆధ్వర్యం లో హోలీవేడుకలు నిర్వహిం చారు. నాయకులు బంక రామస్వామి, ముచ్చకుర్తి చంద్రమౌళి, గుగ్గిళ్ల రవీందర్‌, బిక్షపతి, సురేష్‌ జాదవ్‌, సునీల్‌ యాదవ్‌, ఆవునూరి శంకర్‌, ఆవునూరి శ్రీనివాస్‌, రంగు శ్రీనివాస్‌, ముడ తనపెల్లి సారయ్య, ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీని వాస్‌, మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కంజపురం రాజేందర్‌, శ్రీరామోజు మహేష్‌ పాల్గొన్నారు. మేయ ర్‌ మహంకాళిస్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ నాయకులు వ్యాపార వర్గాలతో కలిసి హోలీవేడుకల్లో పాల్గొన్నారు. వ్యాపారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఓదెల: మండలకేంద్రంలో బుధవారం రెండోరోజు హోలీ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. మంగ ళవారం చంద్రగ్రహణం ఉన్నందున కొంతమంది వేడుకలకు దూరంగా ఉన్న నేపథ్యంలో మరోరోజు వేడుకల్లో గ్రామంలోని కొందరు వార్డుసభ్యులతోపాటు సర్పంచ్‌ కనికిరెడ్డి సతీష్‌, మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్‌, శ్రీపతి మహేష్‌, పోతుగంటి వెంకటేష్‌,వార్డు సభ్యులు వేర్వేరుగా పాల్గొన్నారు.

రామగిరి: మండలంలో బుధవారం హోలీ వేడుకల్లో చిన్నా, పెద్దతేడాలేకుండా రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. రాణిరుద్రమాదేవి క్రీడాప్రాంగ ణంలో వాలీబాల్‌టీం సభ్యులు రంగులు పూసుకొని సంబ రాల్లో మునిగి తేలారు.

Updated Date - Mar 05 , 2026 | 12:45 AM