Share News

Peddapalli: ‘ఖని’లో ఘనంగా హనుమాన్‌ జయంతి ర్యాలీ

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:42 AM

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని పట్టణంలో మంగళవారం రాత్రి హనుమాన్‌ బజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్రను నిర్వహించారు.

Peddapalli:  ‘ఖని’లో ఘనంగా హనుమాన్‌ జయంతి ర్యాలీ

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని పట్టణంలో మంగళవారం రాత్రి హనుమాన్‌ బజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్రను నిర్వహించారు. ఈర్యాలీ గోదావరిఖని కోదండ రామా లయం నుంచి ప్రారంభమై చౌరస్తా, శివాజీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, అడ్డగుంట, లక్ష్మీనగర్‌, పాత మున్సిపాలి టీ కార్యాలయానికి చేరుకున్నది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ విభాగ్‌ కార్యదర్శి అయోధ్య రవీందర్‌, బజరంగ్‌దళ్‌ జిల్లా సంయోజక్‌ ముష్కె సంపత్‌ మాట్లాడుతూ హునుమంతుని పేరుతో 1984లో రామరథయాత్రకు రక్షణగా బజరంగ్‌దళ్‌ సంస్థను ఏర్పాటు చేశారని అన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు హిందూ సమాజం కోసం పని చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, కార్పొరేటర్లు కౌటం సతీష్‌, దొంత శ్రీనివాస్‌, పాతపెల్లి కావ్య, కంకణాల మౌనిక, సత్యప్రసాద్‌, కొమ్ము వేణు, నాయకులు దాసరి విజయ్‌, భాస్కర్‌రెడ్డి, అడిగొప్పుల రాజు, వెంకటస్వామి, జలేందర్‌, అరవింద్‌, పొన్నం అంజయ్య, మమత, తిరుమల, రచన, వీణ పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:42 AM