Peddapalli: ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:23 AM
అంతర్గాం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రామగుండం రైల్వేస్టేషన్ ఏరియాలోని షిరిడీసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమ వేడు కలను ఘనంగా నిర్వహించారు.
అంతర్గాం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రామగుండం రైల్వేస్టేషన్ ఏరియాలోని షిరిడీసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమ వేడు కలను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం జరిగిన కార్య క్రమాల్లో పూజాకార్యక్రమాలను కన్నుల పండువగా జరిపించారు. ఆలయ చైర్మన్, మాజీకార్పొరేటర్ కన్నూరి సతీష్‌కుమార్ పర్యవేక్ష ణలో పూజాదికాలు జరపగా, ఆలయ పూజారి శ్రీరాంపల్లి శ్రీనివాస్ శర్మ వేడుకలు జరిపించారు. భక్తులు క్షీరాభిషేకం చేయగా, సాయి నామస్మరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభనలంకరించుకున్నది. అనం తరం నిర్వహించన అన్నప్రసాద వితరణలో పలువురు భక్తులు పాల్గొన్నారు. దాత పారుపెల్లి శారద చంద్రయ్య, మంద శారద రమేష్ వ్యవహరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఆలయ సందర్శనకు రావడంపై చైర్మన్ కన్నూరి సతీష్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలవేని మల్లేశం, మడక లింగమూర్తి, కేకే స్వామి, సిరికొండ కోటి, కోట తిరుపతి, శ్రీలత, రజని, స్వరూప, సునీత, ఉషా, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
ఫ రామగిరిలో..
రామగిరి : మండలంలోని సెంటినరీకాలనీ శ్రీషిర్డీసాయిమందిరం లో బుధవారం గురు(వ్యాస)పౌర్ణిమ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జీ-3 జీఎం మధుసూదన్ ముఖ్యఅతిథిగా హాజరై పూజలో పాల్గొన్నారు. వేదపండితులు స్థానాచార్యులు గోవర్ధనగిరి వేణుమనోహరాచార్యులు, ఆలయా పూజారి గోవర్ధనగిరి శ్యాంసుందరా చార్యులు వేదమంత్రోచ్ఛరణ మధ్య ఉదయం నుంచి సాయంత్ర వరకు విశేష పూజలను నిర్వహించారు.