Share News

Peddapalli: ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:08 AM

గోదావరిఖని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి సంద ర్భంగా ఆదివారం స్థానిక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో

 Peddapalli:   ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు ఘన నివాళి

గోదావరిఖని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి సంద ర్భంగా ఆదివారం స్థానిక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో టీబీజీకే ఎస్‌ నాయకులు జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ నూనె కొమరయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ తనజీవితాన్ని తెలంగాణ ఏర్పాటుకోసం త్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల కనుగుణంగా మనమందరం ముందుకుసాగా లని, సంస్థ పరిరక్షణకు పోరాడాలని పిలుపు నిచ్చారు. ఆర్‌జీ-1ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కేంద్ర కోశాధికారి చెల్పూరి సతీష్‌, పిట్‌ సెక్రటరీలు, నాయకులు జనగామ మల్లేష్‌, ఉప్పులేటి తిరుపతి, రొడ్డ సంపత్‌, మురళీకృష్ణ, అప్సర్‌ పాష, పర్లపెల్లి అభిషేక్‌, దండే రవి, మీస రాజు, భాస్కర్‌ దేవేందర్‌, దండే యశ్వంత్‌, సారంగపాణి పాల్గొన్నారు.

మంథని : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ ఆచార్య జయశంకర్‌ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌, బీఆ ర్‌ఎస్‌ పార్టీల శ్రేణులు ఆదివారం వేర్వేరుగా నివాళుల్పంచారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు, స్థానికబ్రిడ్జి వద్ద ఉన్న విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌పార్టీ శ్రేణులు పూల మాలలు వేసి నివాళుల్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను, పోరాటాలను వారు కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషన్‌కాచే, డీసీసీ అధికార ప్రతినిధ సెగ్గెం రాజేష్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, ఆర్‌టీఏ మెంబర్‌ మంథని సురేష్‌,, బీఆర్‌ఎస్‌ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, పుప్పాల తిరుపతి, వేల్పుల గట్టయ్య, జావీద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:08 AM