Share News

Peddapalli: ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:17 AM

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని రాగినేడులో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్‌, మండల కన్వీనర్‌ ఇల్లందు అంజి ఆధ్వర్యంలో

Peddapalli:  ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని రాగినేడులో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్‌, మండల కన్వీనర్‌ ఇల్లందు అంజి ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ వైభవంగా నిర్వహించారు. రిటైర్ట్‌ఆర్మీ మేకల విజయ్‌కుమార్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు పొన్నం మధురయ్య పాల్గొని జెండా ఆవిష్కరించారు. దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రతిఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు తంగేడ రాజేశ్వర్‌రావు, తాళ్ల లక్ష్మణ్‌, మండల ప్రధానకార్యదర్శి మామిడి ఉమేష్‌, ముంజ రాజేంద్రప్రసాద్‌, పడాల నరసయ్య, చింతపండు స్వామి, దండు చంద్రయ్య, గుంటుకు సది, మేడగొని శివయ్య, యువ మోర్చా అధ్యక్షులు రెడ్ల వేణు, ముత్యం సాగర్‌, ముసారి రవి పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌ పట్టణకేంద్రంలో మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయత భావాన్ని బలోపేతం చేయడమే హర్‌ఘర్‌ తిరంగా ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్‌ యాదవ్‌, మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్‌, హర్‌ తిరంగా జిల్లా కో కన్వీనర్‌ ఊషణ అన్వేష్‌, కోట నాగేశ్వర్‌, కొల్లూరి సంతోష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎలిగేడు : మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కన్వీనర్‌ కొత్తిరెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, చౌదరి తిరుపతి యాదవ్‌, ఇల్లందుల పరశురాములు, మ్యాదరవేణి రాకేష్‌, పొన్నాల సుమన్‌, ఆసంపల్లి రవి, గాజే భాస్కర్‌ రెడ్డి, అడ్డగుంట తిరుపతిగౌడ్‌, బోగే కిరణ్‌, ఒజ్జ రాజయ్య, అమరగొండ గంగయ్య, ఎలుక శంకర్‌, చిట్టవేని రాజు కుమార్‌, కట్ల ప్రతాప్‌, కోడూరి శ్రీనివాస్‌, గడ్డం సతీష్‌ రెడ్దితోపాటు పలు గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓదెల : మండలంలోని కనగర్తిలో బీజేపీ మండల అధ్యక్షుడు కారేంగుల శ్రీనివాస్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓదెలలో హర్‌,ఘర్‌ తీరంగా మండలకన్వీనర్‌ పుల్లూరి పృథ్వీరాజ్‌ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ సమగ్రతను చాటాలని కోరారు. కార్యక్రమంలో కుక్కల మహేం దర్‌, తీర్థాల కుమారస్వామి, మేరుగు సారంగం, వంగరి చందు, ఆది సతీష్‌,తూడి రాజేందర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ : కాలనీలో మండలశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆకుల శశికుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతిఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జండాలను ఎగురవేసి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మూకిరి రాజు, కుమార్‌గౌడ్‌, అనిల్‌కుమార్‌, లింగంనాయక్‌, జంజర్ల శ్రీనివాస్‌, పాష, స్వామి, సూర్యప్రకాష్‌, గంధం శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:17 AM