Peddapalli: ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:12 AM
పెద్దపల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేసి 24గంటల్లోగా కేటాయించిన రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదే శించారు.
- అనధికారిక మిల్లులకు ధాన్యం పంపిస్తే చర్యలు
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేసి 24గంటల్లోగా కేటాయించిన రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదే శించారు. గురువారం కలెక్టరేట్‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 4.5లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధారించా మన్నారు. ఈనెలలో కొనుగోళ్లు ప్రారంభించి మే నెలా ఖరుకి పూర్తిచేయాలని సూచించారు. కొన్ని కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయించని మిల్లర్లకు ధాన్యం పంపి స్తున్నట్లు గమనించామని, యాసంగి సీజన్‌లో ఇది పున రావృతమైతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. అకాలవర్షాల నేపథ్యంలో ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్ఫాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. రామగిరి గ్రామసభలో చిన్న రైతుల ధాన్యం ముందుగా కొనుగోలు చేయలేదని వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని, ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చిన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వా లని ఆదేశించారు. నాణ్యమైన ధాన్యాన్ని 24గంటలలోపు కేటాయించిన మిల్లులకు తర లించాలని, కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. అవసర మైన గోనె సంచుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌ల ద్వారా 24గంటల్లో 100శాతం ఆన్‌లైన్ నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి వేణు, డీఎస్‌వో శ్రీనాథ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, డీసీవో శ్రీమాల, డీఎంవో ప్రవీణ్ రెడ్డి, ఏపీడీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.