Peddapalli: ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:02 AM
కమాన్‌పూర్/మంథని, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
- ఉపాధిహామీ పనుల్లో కూలీలకు ఎండల నుంచి రక్షణకు చర్యలు
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
కమాన్‌పూర్/మంథని, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం ఆయన కమాన్‌పూర్, మంథని మండలాల్లో పర్యిటించి ధాన్యం కొనుగోళ్లు, ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువమంది హమాలీ కార్మికులను సమకూర్చి వేగవంతంగా కొనుగోలు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవత్ర దృష్ట్యా రైతులకు అవసరమైన ఓఆర్‌ఎస్ పాకెట్లు, తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఉపాధిహామీ పనుల కింద చేపట్టిన ఎస్సా రెస్పీ కెనాల్ మరమ్మతు పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు ఎండలను దృష్టిలో ఉంచుకొని తగినజాగ్రత్తలు తీసుకోవా లన్నారు. నీరు,నీడ,విశ్రాంతిసదుపాయాలు కల్పించా లని అధికారులను ఆదేశించారు.
పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలి..
మంథని మండలకేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ (బాలి కల) పాఠశాలలో నిర్వహిస్తున్న ఏఐ శిక్షణ తరగ తులను, వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్‌ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. విద్యా ర్థులు చేసిన డ్రాయింగ్‌లను కంప్యూటర్‌లోకి మార్చి, ఏఐ సాయంతో యానిమేషన్‌గా రూపొందించిన విధానాన్ని కలెక్టర్ ఆసక్తిగా వీక్షించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు అర్థమయ్యే విధంగా ఏఐ బోధన చేయాలన్నారు. విద్యార్థులకు ఏఐపై పూర్తి అవ గాహన కల్పించేలా ఉపాధ్యాయులు మరింత సమయం కేటాయించా లన్నారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని సూచించారు. రోబో టిక్స్ శిక్షణ ఎప్పుడు ప్రారంభమవుతుం దనే అంశంపై కలె క్టర్ ఆరాతీసి త్వరలోనే ప్రాంభిం చేందుకు చర్యలు తీసుకోవాలని అధి కారులను అదేశిం చారు. విద్యాశాఖ స్టార్టప్ సూపర్‌టీచర్‌తో సమన్వయం చేస్తూ మంథ నిలో సూపర్‌సమ్మర్ పేరుతో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తు న్నామని అన్నారు. ఇందులో 70మంది రెండు బ్యాచ్ లలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. మంథని అనంతరం రామగుండం, పెద్దపల్లి ప్రాంతంలో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అనంతరం వయోవృద్దుల డేకేర్ సెంటర్‌ను కలెక్టర్ సందర్శిం చారు. డేకేర్ సెంటర్‌లో వృద్ధుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమా ధికారి వేణుగోపాల్, ఐటీ శాఖకు చెందిన ప్రత్యేక అధికారి జేఎస్ రాహుల్, డీఆర్డీవో కాలిందిని పాల్గొన్నారు.