Peddapalli: ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుంది
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:22 AM
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఎళ్లప్పుడూ అండగా ఉంటుం దని రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు.
- సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఎళ్లప్పుడూ అండగా ఉంటుం దని రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు. ఆదివారం గోదావరిఖని ఆర్టీసీ డిపోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రామ గుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చిత్రప టానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించిందన్నారు. అంతేకాకుండా పేరివిజన్‌ను ప్రకటించారని చెప్పారు. సమ్మెకాలంలో డ్రైవర్ శంకర్ మృతిచెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఆర్‌టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్‌నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికు మార్, కార్పొరేటర్లు దూళికట్ట సతీష్, చిదురాల నాగరాజు, మాటూరి సత్య ప్రసాద్, ముస్తాఫా, గట్లరమేష్, కొలని కవితారెడ్డి, నాయకులు గడ్డం శ్రీనివాస్, బొమ్మక రాజేష్, గంగశ్రీను, కొప్పుల శంకర్, డీఎం నాగభూషణం, వంగర శ్రీనివాస్, ఆర్టీసీసిబ్బంది పాల్గొన్నారు.
ధర్మారం : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో కార్మికులు ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆత్మాహుతికి పాల్పడిన డ్రైవర్ శంకర్‌గౌడ్ చిత్రపటా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రభుత్వం అన్నివర్గాల కార్మికులకు అండగా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్ అన్నారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, వైస్‌చైర్మన్ అరిగె లింగయ్య, ఏఎంసీ డైరెక్టర్ కాంపెల్లి రాజేశం, కాంగ్రెస్‌సీనియర్ నాయకులు కొడారి అంజయ్య, బొల్లి స్వామి, కాడె సూర్యనారాయణ, ఏదుల్ల అంజయ్య, ఓరెం చిరంజీవి, దేవి లావణ్య, జంగ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.