Share News

Peddapalli: ఆదివాసీల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలి

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:01 AM

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ విధా నాలను అడ్డుకోవాలని ఉమ్మడికరీంనగర్‌ జిల్లా పౌరహక్కుల కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు

Peddapalli: ఆదివాసీల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ విధా నాలను అడ్డుకోవాలని ఉమ్మడికరీంనగర్‌ జిల్లా పౌరహక్కుల కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్స వం సందర్భంగా ఉమ్మడి జిల్లా పౌరహక్కుల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బొంకూరి లక్ష్మణ్‌ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ఆదివాసీ లకు కల్పించిన ప్రత్యేక రక్షణ హక్కులు ఉన్నా, నేటికీ వారి భూములు, అడవులు, సహజ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉందని ఆవే దన చెందారు. అభివృద్ధి పేరుతో అడవుల్లోని ఖనిజ సంపదను దోచిపెడుతూ పెత్తందారు లకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలను మానుకోవాలన్నారు. ఆది వాసీల భూములకు రక్షణ కల్పించేందుకు ఉద్దే శించిన 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, అక్రమంగా బదలాయించిన గిరిజన భూములను తిరిగి వారికే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, రైతుసమస్యలు సాధనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, ఏఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌, తెలం గాణ ప్రజాప్రంట్‌ రాష్ట్రకార్యదర్శి గాండ్ల మల్లేశం, పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీం నగర్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొంకూరి లక్ష్మణ్‌, బొడ్డుపల్లి రవి, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బొంకూరి లక్ష్మణ్‌, బొడ్డుపల్లి రవి, జిల్లాఉపాధ్యక్షులు నారావినోద్‌, జిల్లాకమిటీ సభ్యులు సత్యనారాయణ, శంకర్‌, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ జిల్లాఅధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు గుమ్మడి కొమురయ్య, పులిపాక రవీందర్‌, కమిటీసభ్యులు, సామాజిక ఉద్య మకారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:01 AM