Share News

Peddapalli: విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:26 AM

పెద్దపల్లి టౌన్‌/ఎలిగేడు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వవిప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

Peddapalli: విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం
ఎలిగేడులో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్న విప్‌, ఎమ్మెల్యే విజయ రమణారావు

రూ.800కోట్ల కేటాయింపు

హరే రామ హరే కృష్ణ ట్రస్టు భాగస్వామ్యంతో అమలు

పెద్దపల్లి టౌన్‌/ఎలిగేడు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వవిప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ మహిళా, బాలుర జూనియర్‌ కళాశాలల్లో, ఎలిగేడు మండలంలోని సుల్తాన్‌పూర్‌ ప్రభుత్వఉన్నత, ఎంపిపిఎస్‌ పాఠశాలల్లో హరే రామ హరే కృష్ణ ట్రస్టు భాగస్వామ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం విజయరమణారావు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం ద్వారా పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం రూ.800 కోట్లు కేటాయించారని తెలిపారు. హరే రామ హరే కృష్ణ ట్రస్టు భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఇంటర్మీడియట్‌ అధికారులు, నాయకులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.సుల్తానాబాద్‌లో సర్పంచ్‌ కవ్వంపల్లి బాపయ్య పీఏసీఎస్‌ చైర్మన్‌ సామరాజేశ్వర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పొట్యాల రమేష్‌, వైస్‌చైర్మన్‌ కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, ఎంఈవో నరేంద్రచారీ, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలల హక్కులు పరిరక్షించేందుకు కృషి చేయాలి

పెద్దపల్లి టౌన్‌: బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణాను అరికట్టి బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ప్రభుత్వవిప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపు నిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సాధన సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను గురువారం మున్సిపల్‌చైర్మన్‌ నూగిల్ల మల్లయ్యతోకలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాధనసంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాధన సంస్థ జిల్లా సమన్వయకర్త ప్రేమ్‌ కుమార్‌, సంస్థ సిబ్బంది కవిత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 12:26 AM