Peddapalli: ప్రభుత్వ భూమి కబ్జా
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:58 PM
ముత్తారం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రభుత్వభూములు అక్రమార్కుల పాలవుతున్నాయి.
- అధికారుల నిర్లక్ష్యం..
- సర్వేనంబర్ 181లో వెలుగుచూసిన అక్రమం
ముత్తారం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రభుత్వభూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. సర్కారు భూమి కనిపిస్తే చాలు ‘సొంతఆస్తి‘లా మార్చేసు కుంటున్న దందా ముత్తారం మండలం పారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శాతరాజ్‌పల్లిలో బహిర్గత మైంది.
సబ్‌స్టేషన్ పక్కనే సాగు..
శాతరాజ్‌పల్లిలోని సర్వేనంబర్ 181లో గల ప్రభుత్వ భూమిలో ఇటీవల విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. నిర్మాణంకోసం ఎకరం భూమిని అధికారులు కేటాయిం చారు. అయితే, సబ్‌స్టేషన్ కేటాయించగా మిగిలిన విలువైన ప్రభుత్వభూమిపై పక్క జిల్లావాసుల కన్నుపడింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన కొందరు అక్రమార్కులు ఏకంగా ఈ భూమిని కబ్జాచేసి, యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. సరిహద్దులు దాటి వచ్చి మరీ సర్కారుభూమిని ఆక్రమి స్తుంటే స్థానిక యంత్రాంగం నిద్ర మత్తులో ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి.
ఫ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
- నాగినేని జగన్మోహన్‌రావు, మాజీ జడ్పీటీసీ
ప్రభుత్వభూమి ఆక్రమణకు గురవుతుంటే అధికారులు నోళ్లు మెదపకపోవడం దారుణం. కళ్లముందే విలువైన భూమి కబ్జా అవుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించు కోకపోవడం చాలా బాధాకరం. వెంటనే అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలనజరపాలి. ఆక్రమణలను తొలగించి కబ్జాదారులపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతాం.