Peddapalli: వైభవంగా గోదా రంగనాయక స్వామి కల్యాణోత్సవం
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:37 AM
సుల్తానాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం వైభవంగా గోదారంగ నాయక స్వామి కల్యాణోత్సవం జరిగింది.
సుల్తానాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం వైభవంగా గోదారంగ నాయక స్వామి కల్యాణోత్సవం జరిగింది. ఆల యంలో ముప్పదిరోజుల పాటు పాశురాల అను సంధాన కార్యక్రమం నిర్వహించారు. నెలాఖ రులో గోదారంగనాయకుల స్వామి కల్యాణోత్స వాన్ని నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలో 28వ పాశుర విన్నపం అనంతరం మధ్యాహ్నం కాలక్షేప మండపంలో కల్యాణ వేడుకులు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పల్లా ముళీధర్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఎమ్మెల్యే విజయరమణారావు తదితరులు పాల్గొనగా వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సత్కరించారు.
రేపు కల్వచర్లలో..
రామగిరి: మండలం లోని కల్వచర్ల గ్రామంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ఈనెల14న గోదాదేవి కళ్యాణ మహో త్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీచైర్మన్ రేండ్ల కుమార స్వామి ఆధ్వర్యంలో శివరామకృష్ణభజన మండలి సభ్యులు ఆలయాన్ని ముస్తా బు చేస్తున్నారు. ఆలయానికి రంగులు పూర్తికాగా విద్యుత్‌లైన్‌ల మరమ్మతుల పను లను ఆలయకమిటీ పర్యవేక్షించింది. కల్యాణ మహోత్సవానికి సోమవారం ఆర్జీ-3 జీఎం మధుసూదన్‌కు స్థానిక సర్పంచ్ రేండ్ల శారద, ఆలయ కమిటీ చైర్మన్ రేండ్ల కుమారస్వామి దంపతులు మర్వదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు.