Share News

Peddapalli: రామగుండంలో 7వేల మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వండి..

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:22 AM

గోదావరిఖని, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న 7వేల మందికి పట్టాలు ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.

 Peddapalli:  రామగుండంలో 7వేల మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వండి..

అసెంబ్లీలో ప్రస్తావించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

గోదావరిఖని, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న 7వేల మందికి పట్టాలు ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. బుధ వారం అసెంబ్లీలో పలు సమస్య లను లేవనెత్తారు. సింగరేణి, జెన్‌కో స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న వారికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ 18వేల మందికి పట్టాలు ఇచ్చారని, మరో 7వేలమందికి పట్టాలు ఇవ్వ వల్సి ఉందని, ఇంకా 11వేల మంది నిరుపేదలను గుర్తించారని, వారికి ఖాళీ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇందిరమ్మ కాలనీగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. రామగుండం నియోజకవర్గం లో 3500మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, అంతేకాకుండా 400మంది కి ఇండ్ల స్థలాలు ఇచ్చి రూ.5లక్షలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రామగుండంలో 53మంది ట్రాన్స్‌జెండ్లకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తు న్నామన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:22 AM