Share News

Peddapalli: పెద్దపల్లి అభివృద్దికి రెండేళ్లలో వెయ్యికోట్ల నిధులు

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:35 AM

సుల్తానాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్‌ జెండా ఎగిరేలా కార్యకర్తలు కృషిచేయాలని మున్సిపల్‌ ఎన్ని కల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Peddapalli:  పెద్దపల్లి అభివృద్దికి రెండేళ్లలో వెయ్యికోట్ల నిధులు

- మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేలా కృషిచేయాలి

- విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి

- అభివృద్ది, సంక్షేమానికే పట్టం కట్టనున్న ఓటర్లు

- ఎన్నికల సన్నాహక సభలో మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి

సుల్తానాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్‌ జెండా ఎగిరేలా కార్యకర్తలు కృషిచేయాలని మున్సిపల్‌ ఎన్ని కల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం సుల్తానాబాద్‌ పట్టణంలో పెద్ద పల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షతన జరిగిన మున్సి పల్‌ ఎన్నికల సన్నాహకసమావేశంలో మంత్రులు మాట్లా డుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయరమణా రావు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. పెద్దపల్లికి నాలుగు పోలీస్‌స్టేషన్లు తెచ్చిన ఘనత ఆయనదన్నారు. సీఎంకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ పనులు సాధించు కుంటున్నారన్నారు. సుల్తానాబాద్‌ చెరువును మినీట్యాంక్‌బండ్‌ గా మార్చేందుకు ఇటీవల ఎనిమిదికోట్ల నిధులు తెచ్చాడ న్నారు. మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడానికి గాను గెలుపుగుర్రాలకే టికెట్లు కేటాయిస్తామన్నారు. ఆశా వహులు నిరాశచెందకుండా కాంగ్రెస్‌అభ్యర్థులను గెలిపించుకో వాలన్నారు. వారికి భవిష్యత్తులో సముచితస్థానం కల్పిస్తామ న్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్లు మినుపాల ప్రకాశ్‌రావు, ఈర్ల స్వరూప, నాయకులు ఐల రమేష్‌, సారయ్యగౌడ్‌, మహేందర్‌,చీకట్ల మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ ఐల రమేష్‌ కాంగ్రెస్‌ లో చేరిక..

పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ బీసీ నాయ కుడు, సుల్తానాబాద్‌ మాజీఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేసిన డాక్టర్‌ ఐల రమేష్‌ బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి పెద్ద పల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో మంత్రులు జూపల్లి క్రిష్ణారావు, దుద్ధిళ్ల శ్రీదర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌ గూటిలో చేరారు. ఆయనకు మంత్రులు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. రమేష్‌తో పాటు నియోజక వర్గంలోని ఆయన భారీఅనుచరగణం కూడా పార్టీలో చేరారు.

రామగుండం కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి..

గోదావరిఖని: కాంగ్రెస్‌ కార్యకర్తలు సమష్టిగా పనిచేసి రామగుండం నగరపాలకసంస్థపై కాంగ్రెస్‌జెండా ఎగురవేయా లని, మేయర్‌పీఠాన్ని దక్కించుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పేదలకు గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇండ్లు నిర్మించే ఆలోచన ఉందని, త్వర లోనే కార్యరూపం దాల్చుతుందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై రెండురోజుల క్రితం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, తాను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో చర్చించామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యంగా కార్మికుల సొంతింటి పథకం కార్యరూపం దాల్చ నుందన్నారు. పత్రికలు, సోషల్‌మీడియాలో ప్రభుత్వంపై అసత్య కథనాలు, పోస్టులను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.

Updated Date - Jan 29 , 2026 | 12:35 AM