Peddapalli: నాలుగు లేబర్ కోడ్స్ ఉపసంహరించుకునే వరకు పోరాటం
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:45 AM
పెద్దపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుక వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకునే వరకు పోరాటం
- కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
పెద్దపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుక వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బుధవారం నాలుగు లేబర్ కోడ్స్‌ను నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యం లో నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ జిల్లాకార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునీల్, బి అశోక్‌లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్‌ను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని, ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్‌ను అమ లుచేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేకసార్లు సమ్మెలు నిర్వహిం చినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకు శంగా లేబర్‌కోడ్స్ అమలుకు ఆదేశాలు చేసింది. వెంట నే నాలుగు లెబర్‌కోడ్స్‌ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బిక్షపతి, సహాయ కార్యదర్శులు సీపెల్లి రవీందర్, జి జ్యోతి, తాండ్ర అంజయ్య, ఏఐటీయూసీ నాయకులు పెర్క రాయమల్లు, ఇతర కార్మిక సంఘాల నాయకులు మేకల సతీష్ శివరామకృష్ణ, యాకుబ్, సాగర్, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా, రైతువ్యతిరేక విధానాలను అరికట్టాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి సదానందం
పెద్దపల్లిటౌన్ : కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, రైతువిధానాలను అరికట్టాలని సీపీఐ జిల్లాకార్య దర్శి తాండ్ర సదానందం జిల్లాకార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. రాష్ట్రసమితి పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో ఆయన గడపగడపకూ సీపీఐ విరాళాల సేకరణ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లా డుతూ కేంద్రప్రభుత్వం రైతుల హక్కు లను కాలరాసే విధంగా మూడు రైతుచట్టాలను తీసుకొచ్చిందన్నారు. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్ర మంలో పెద్దపల్లి మండల కార్యదర్శి పూసాల రమేష్. సహాయ కార్యదర్శి ఆరెపల్లి మానస్‌కుమార్, బాలసాని లెనిన్, చంద్రగిరి ఉదయ్, బండారి సదా నందం, జోగుల రామస్వామి, కాదాసి సదయ్య, మాచర్ల లక్ష్మ ణ్, శంకర్, కల్లేపల్లిరవి, బాలాజీ, పెర్క రాయమల్లు, దొమ్మటి రాజేష్ పాల్గొన్నారు.
పోరాటం ఉధృతం చేస్తాం: సీఐటీయూ
అంతర్గాం : కేంద్రం తెచ్చిన లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తా మని సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షుడు, యూనియన్ గౌరవ సలహాదారుడు భిక్షపతి అన్నారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ రైల్వేకాంట్రాక్టు, క్యాజువల్ హమాలీవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా బుధవారం రామగుండం రైల్వే కాం ట్రాక్టు కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి రైల్వే ఓఆర్ హెచ్ వ్యాగన్, వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న కార్మికులు నిరసనలు తెలిపారు.కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొంకూరి మహేష్, తిరుపతి, సరళ, రాధ, ఈదునూరి బాబు, అవినాష్ పాల్గొన్నారు.
జ్యోతినగర్ : లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయా లని పలుసంఘాలు, పార్టీలకు చెందిన నాయ కులు ఎన్టీపీసీ గేట్‌నంబర్2 వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి కార్మి కులతోకలిసి నిరసనలు చేపట్టారు. కార్యక్రమంలో ఏఎప్టీయూ చిలుకశంకర్, సీఐటీయూ లక్ష్మారెడ్డి, ఏఐటీ యూసీ నాంసాని శంకర్,టీయుసీఐ రమేష్, టీఆర్‌ఎస్ ఇజ్జగిరి భూమయ్య, ఐఎన్‌టీయూసీ భూమలచందర్, కేసీఎంఎస్ సత్యం,లక్ష్మయ్య,పెగడపల్లి వెంకటస్వామి, ఈసంపెల్లి రాజేందర్, మహేందర్ పాల్గొన్నారు.
రామగిరి: సింగరేణి ఆర్జీ-3,ఏపిఏ డివిజన్‌లలో బుధవారం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూలు వేర్వేరుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 29చట్టాలను పునరుద్దరించే వరకు ఎనర్జీ సెక్టార్స్ కోల్‌అండ్‌పవర్, ఆయిల్ కంపెనీలలో అన్ని సంఘాలతో ఐక్యంగా నిరవధికసమ్మెకు దిగాలని సీఐ టీయూ నాయకుడు కొమురయ్య పిలుపునిచ్చారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ నాయ కులు వెంకటేశ్వర్లు, రవికుమార్, గోపాల్, సదానందం, రాజేష్, విజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, రంజిత్, రాజబాబు, ఐఎఫ్‌టీయూ నాయకులు నర్సయ్య,రాజనర్సు, సంపత్, ఇమామ్, రాజమౌళి పాల్గొన్నారు.