Share News

Peddapalli: రీసర్వేలో రైతుల అభ్యంతరాలను పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:32 AM

సుల్తానాబాద్‌/ఎలిగేడు, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి): భూముల రీసర్వే ప్రక్రియలో రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన తర్వాతే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

Peddapalli:  రీసర్వేలో రైతుల అభ్యంతరాలను పరిష్కరించాలి
రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- పక్కాగా రికార్డులు నమోదు చేయాలి

- కలెక్టర్‌ కోయశ్రీహర్ష

సుల్తానాబాద్‌/ఎలిగేడు, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి): భూముల రీసర్వే ప్రక్రియలో రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన తర్వాతే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సుల్తానాబాద్‌ మండలంలోని రెబ్బల్‌దేవ్‌పల్లి గ్రామంలో, ఎలిగేడు మండలం నర్సాపూర్‌ గ్రామంలో భూముల రీసర్వే గ్రామసభలో పాల్గొని, పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెబ్బల్‌దేవ్‌పల్లి గ్రామంలో భూముల రీసర్వే ప్రక్రియ పూర్తయినందున రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రైతుల అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిష్కరించిన తర్వాతే భూములకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. రైతు లకు తమ భూములకు సంబంధించిన వివరాలపై పూర్తిస్పష్టత కల్పించాలన్నారు. భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలకు అవకాశంలేకుండా రికార్డు లను రూపొందించాలన్నారు. సర్వేకు సంబంధించిన రికార్డుల పరిశీలన, నమోదు తదితర పనులను వేగవంతం చేసి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా రీసర్వే ప్రక్రి యను పూర్తిచేయాలన్నారు. సర్వేపనులను వేగవంతం చేసి వారం రోజుల్లోగా పూర్తిచేయాలని అధికారులకు స్పష్టంచేశారు. కార్యక్రమా ల్లో ఏడీల్యాండ్‌ రికార్డ్స్‌సోమేశ్వర్‌, సుల్తా నాబాద్‌ తహసీల్దార్‌ భషిరోద్దిన్‌, రైతులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఎలి గేడు జరిగిన కార్యక్రమంలో ఏడీల్యాండ్‌ రికార్డు అధి కారి సోమేశ్వర్‌, తహసీల్దార్‌ యాకన్నా, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేంద్ర ప్రసాద్‌, సర్పంచ్‌ పల్లెర్ల వెంకట్‌ గౌడ్‌, ఆర్‌ఐ చంద్ర శేఖర్‌, జిపివో రాకేష్‌, రైతులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వభూములను గుర్తించాలి

మంథని : మంథని పట్టణంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను గుర్తించి, అనువైన స్థలాలను కేటాయించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారు లను ఆదేశించారు. మంథని ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత అధికారులతో శనివారం ఆయన ప్రభుత్వ భూములు, వాటివినియోగం, భవిష్యత్తులో చేపట్టా ల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థలాలపై సమీక్షించారు. ఏటీసీ, ఎన్‌ఏసీ పరిధిలోని ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వకార్యాల యాలు, వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణంతోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన ప్రభుత్వ భూములను ముందుగానే గుర్తించాలని సూచించారు. ఆయా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వభూముల వివరాలను సేకరించి, అను వైనస్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించారు. ప్రస్తుత వినియోగానికి సంబంధిం చినవివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. భూములను గుర్తించేటప్పుడు రహదారి సౌకర్యం, ప్రజలకు అందుబాటు, భవిష్యతులో విస్తరణకు ఉన్న అవకాశాలను పరిగణనలోకితీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో ఆర్డీవోసురేష్‌, తహసీల్దార్‌ ఆరిఫోద్దీన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 12:32 AM