Peddapalli: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు రెట్టింపు ఆదాయం
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:18 AM
పాలకుర్తి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు.
- రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్
పాలకుర్తి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. బుధవారం పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లిలో ఉద్యానవనశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, అవ గాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను నిర్ణీతగడువులోగా పూర్తి చేసేం దుకు సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సాయం, మౌలికసదుపాయాలు, ప్రోత్సాహకాలు అందే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాఉద్యానవనశాఖ అధికారి గడ్డంశ్యామ్‌ప్రసాద్, ఉద్యా నవనశాఖ అధికారిణి జ్యోతి, తిరుమల ఆయిల్‌పామ్ కంపెనీ సీఈవో కేషు కళ్యాణ్, ఏఎంసీ చైర్మన్ గడ్డం తిరుపతి, సర్పంచ్ బండిశ్రీనివాస్, ఉపసర్పంచ్ ఒడ్నాల జ్యోతిరాజు, భూగర్భజలాలశాఖ అధికారులు లావణ్య, సుజాత,మండలవ్యవసాయాధికారి బండిప్రమోద్ కుమా ర్, ఉద్యానవనశాఖ అధికారులు, తిరుమల ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం..
అంతర్గాం : పట్టణప్రగతి ప్రణాళికల్లో భాగంగా బుధవారం ఉదయం రామగుండంలోని 26,27,28 డివిజన్‌లలో పర్యటించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజ లకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీమేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఇన్‌చార్జి కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..
గోదావరిఖని : క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్‌పార్టీని జిల్లాలో బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, రామ గుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ జిల్లా కార్య వర్గానికి సూచించారు. బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాకాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రతినాయకుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరి ష్కారానికి కృషిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ భవిష్యత్‌కార్యాచరణ, మండలస్థాయిపార్టీ బలో పేతం, సభ్యత్వనమోదు, ప్రజాసమస్యలపై పోరాటాలు, సోషల్‌మీడియా వినియోగం, పార్టీకార్యక్రమాల నిర్వ హణ తదితర అంశాలపై చర్చించారు. సమా వేశంలో నాయకులు దీటి బాలరాజు, తొట్ల తిరుపతి యాదవ్, అనుమ సత్యనారాయణ, దూళికట్ట సతీష్, చుక్కల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు.