Peddapalli: ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:31 AM
కమాన్‌పూర్, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని గుండారంలో శనివారం ఆయిల్‌పామ్ సాగుపై జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ రైతులకు అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు.
కమాన్‌పూర్, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని గుండారంలో శనివారం ఆయిల్‌పామ్ సాగుపై జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ రైతులకు అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగులో నీటి, పోషక యాజమాన్యం అత్యంత కీలకమ న్నారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ తోటల్లో సమర్థవంత మైన నీటి యాజమాన్యం, సమతుల్య పోషకాల విని యోగం ద్వారా పుష్పాల అభివృద్ధి, గెలల ఏర్పాటు, అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్‌పామ్ సాగులో రైతులకు అవసరమైన స్లాషర్లు, ష్రెడర్లు, మినీ ట్రాక్టర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు బిందుసేద్య పరికరాలపై ఉద్యానవనశాఖ ద్వారా రాయితీలు అంది స్తున్నట్లు వివరించారు. ముత్తారం, మంథని, రామ గిరి, కమాన్‌పూర్ మండలంలోని ఆయిల్‌ఫామ్ రైతులు రైతులంతా ఒకయూనిట్లుగా ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే భారీ సబ్సిడీలను ఒక కోటి వరకు అందుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా కీటక శాస్త్రవేత్త డాక్టర్ వెంకన్నతోపాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పలుసూచనలుచేశారు. కార్యక్రమంలో గుండారంసర్పంచ్ జంగిలిపోచాలు, పీఏసిఎస్ చైర్మన్ భాస్కర్‌రావు, ఉద్యానవన అధికారి జ్యోతి, ఉద్యానవన విస్తరణాధికారినవీన్, అనూష, ఆయిల్‌ఫామ్ క్షేత్ర స్థాయి సిబ్బంది రాకేష్, రైతులు పాల్గొన్నారు.