Share News

Peddapalli:మల్లన్న ఆలయంలో ప్రముఖుల పూజలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:22 AM

ఓదెల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఈనెల ఉగాదిపండుగ నేపథ్యంలో మల్లన్న ఆలయానికి వీఐపీల తాకిడి, భక్తుల రద్దీ పెరిగింది.

Peddapalli:మల్లన్న ఆలయంలో ప్రముఖుల పూజలు

ఓదెల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఈనెల ఉగాదిపండుగ నేపథ్యంలో మల్లన్న ఆలయానికి వీఐపీల తాకిడి, భక్తుల రద్దీ పెరిగింది. ఆది వారం భ్రమరాంబ మల్లికార్జునస్వామి క్షేత్రంలో గోదావరిఖని ప్రిన్సిపాల్‌కోర్టు జడ్జి వెంకట సత్య నారాయణరెడ్డి, అలాగే ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు దంపతులు, పలు కుటుం బాలతో సందర్శించి అభిషేకాలు నిర్వహించారు. అంతకంటే ముందు ఆలయ సాంప్రదాయకంగా వారికి ప్రధానఅర్చకుడు ధూపం వీరభద్రయ్య, అర్చకులు, ఆలయకమిటీ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. అలాగే ఎమ్మెల్యే దంపతులు, కుటుంబసభ్యులతో ఒగ్గు డోలు కళాకారుల వాయిద్యాల మధ్య, బోనాలతో ఆలయానికి చేరుకోని పట్నాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబాలను, జడ్జిని వేర్వేరుగా ఆలయ సాంప్రదాయకంగా ఈవో సదయ్య, అర్చకులు, చైర్మ న్‌ చీకట్ల మొండయ్య సన్మానించి, ఆలయజ్ఞాపికలను అంద జేశారు. అలాగే పెద్దపల్లి సీఐతోపాటు రిటైర్డ్‌ ప్రభుత్వఉద్యో గులు, పలు మండలాల నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, భక్తులు సందర్శించి పూజలు నిర్వహించారు. ఉగాదికి ముందు ఆలయంలో భక్తులు పూజలు చేయడం దశాబ్దాల తరబడి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లోని పలు మండలాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి మల్లన్న, మదన పోచమ్మ, బంగారు పోచమ్మలను దర్శించుకు న్నారు. పట్నాలు, కోడే మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్‌ రెడ్డి, కమిటీ సభ్యులు, అలాగే మాజీ సింగిల్‌ విండోచైర్మన్‌ ఆళ్ల సుమన్‌రెడ్డి, కాంగ్రెస్‌నాయకులు అంబాల కొమురయ్య, ఎడవెల్లి విజయపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫ మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

మల్లికార్జునస్వామి క్షేత్రంలో మిగిలిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు ఈవో సదయ్యను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయసమీపంలో ఆయన ఈవోకు పలుసూచనలు చేశారు. అదేవిధంగా ఈనెల19న, ఉగాది పర్వదినాన్ని పురస్కరించు కొని ఆలయ ప్రాంగణాల్లో ఘనంగా ఏర్పాట్లను చేయాలని తెలిపారు. ఇప్పటినుంచే ఈ ప్రయత్నాలు కొనసాగాలని సూచించారు. మండల కేంద్రంలోని సివిల్‌ కోర్టుకు నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పనులను చేపట్టేందుకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:22 AM