Peddapalli: సమ్మక్క-సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:29 AM
కోల్‌సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మేడారం తరువాత గోదావరితీరంలో గోదావరిఖని వద్ద జరిగే అతిపెద్ద సమ్మక్క-సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రూ.6కోట్లతో శాశ్వతప్రాతిపదికన అభివృద్ధి పనులు
గోదావరి ముంపుతో గద్దెల పునర్ నిర్మాణం
60ఎకరాల స్థలంలో జాతర నిర్వహణ
మేడారం తరువాత అతిపెద్ద జాతర
8లక్షల నుంచి 10లక్షల మంది హాజరయ్యే అవకాశం
కోల్‌సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మేడారం తరువాత గోదావరితీరంలో గోదావరిఖని వద్ద జరిగే అతిపెద్ద సమ్మక్క-సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు రూ.6కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నారు. గోదావరి వరదలో సమ్మక్క -సారలమ్మ జాతర ప్రాంగణం ముంపునకు గురి కావ డంతో భవిష్యత్‌లో ఈప్రాంతం ముంపునకు గురి కాకుండా ముందుస్తు ప్రణాళికతో అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారు. దీనిలో భాగంగా మేడారం మాస్టర్ ప్లాన్‌కు తగ్గట్టు గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతు న్నారు. జాతర జరిగే ప్రాంతాన్ని రూ.4కోట్ల సింగరేణి నిధులతో సుమారు మీటరున్నర ఎత్తుతో మట్టితో నింపి లెవలింగ్ చేశారు. గద్దెలను వరుస క్రమం లో ఎత్తు పెంచి ఏర్పాట్లు చేశారు. సమ్మక్క -సారమల్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలను గ్రానైట్స్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. గద్దెల ప్రాంగణం చుట్టూ గ్రిల్స్‌ను ఏర్పాటుచేశారు. సుమారు రెండు ఎకరాల స్థలం చుట్టూ ప్రహారి నిర్మించి లోపల గ్రానైట్ పరిచారు. ఆలయం ముందు గోపురాలు కడుతున్నారు. ముందర షెడ్లు ఏర్పాటు చేశారు. వెనక శుభ కార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా హాల్‌ను నిర్మించారు. జాతర ప్రాంగణానికి రాజీవ్‌రహదారి నుంచి వచ్చేలా ఇరువైపులా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. పెట్రోల్ బంక్ వద్ద కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేశారు. గోదావరి వద్ద మెట్లు రెయిలింగ్, శివుడి విగ్రహం వద్ద సుందీకరణ పనులు చేపట్టారు. సింగ రేణి సుమారు రూ.4కోట్లు వెచ్చిస్తుండగా, రామ గుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.1.5కోట్లతో పనులు జరుగుతున్నాయి. ప్రహారి నిర్మాణం, షెడ్, బాత్‌రూ మ్‌లు, పుష్కర ఘాట్ వద్ద షవర్ల ఏర్పాటు, క్లీనింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. జాతర ప్రాంగణంలో భారీలైటింగ్ ఏర్పాటు చేస్తు న్నారు. సింగరేణి, ఎన్‌పీడీ సీఎల్‌ల సహకారంతో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ జాతర ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సింగరేణి, ఎన్‌టీపీసీ నుంచి మంజూరు చేయించారు. ఆర్‌జీ-1జీఎం లలిత్‌కుమార్, సింగరేణి శ్రీను, సింగరేణి సివిల్ అధికారులు ఎప్పటి కప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పలుమార్లు జాతర ప్రాంగణాన్ని సందర్శించి అభివృద్ధి పనులపై సూచనలు చేశారు.
ఫ రూ.8నుంచి 10లక్షల మంది
హాజరయ్యే అవకాశం..
మేడారం తరువాత తెలంగాణలో అతిపెద్ద జాత రగా పేరున్న గోదావరిఖని జాతరకు గత జాతరకు 6లక్షలకుపైగా జనం హాజరయ్యారు. ఈ ఏడాది 8లక్షల నుంచి 10లక్షలమంది హాజరవుతారని అంచ నా వేస్తున్నారు. సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాలైన రామ గుండంతోపాటు శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, చెన్నూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి జనం ఈజాతరకు హాజర వుతారు. రోడ్డు, రైలు రవాణా అందు బాటులో ఉండడంతోపాటు గోదావరి తీరం కావడం, విస్తృత ఏర్పాట్లు ఉండ డంతో ఇక్కడి జాతరకు హాజరయ్యేం దుకు జనం మొగ్గు చూపుతారు.
ఫ భద్రత ఏర్పాట్లే ముఖ్యం..
సమ్మక్క-సారలమ్మ జాతరలో భద్రత ఏర్పాట్లు కీలకం. ప్రతి మేడారం జాత రకు రామగుండం కమిషరేట్ నుంచి పోలీస్ అధికారులను, సిబ్బందికి ఎక్కువ సంఖ్యలో పంపడంతో ఇక్కడ అధికారులు, సిబ్బంది కొరత ఏర్పడు తోంది. దీంతో పలుమార్లు రాజీవ్ రహ దారిపై ట్రాఫిక్ స్థంబిస్తున్నది. ఈ సారైనా భద్రత ఏర్పాట్ల విషయంలో పోలీసుశాఖ ముందస్తు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఫ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు..
- ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరితీరంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాత రకు శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక బద్ధంగా పనులు చేపట్టాం. రూ.6కోట్లతో అభి వృద్ధి పనులు జరు గుతున్నాయి. పనులు పూర్తికావచ్చాయి. రాబోయే రోజుల్లో పర్యాటకంగా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాంగణంలోనే ఫంక్షన్‌హాల్స్ కూడా నిర్మించి ప్రజలకు అందు బాటులోకి తీసుకువస్తాం. గోదావరి పుష్కరాలకు కూడా ఈ ప్రాంగణం వేదిక కానున్నది.