Peddapalli: ఫూలే ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలి
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:28 AM
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిరావుఫూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అమర్‌నగర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ బీసీసెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘన నివాళుల ర్పించారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిరావుఫూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అమర్‌నగర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ బీసీసెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన గొప్ప సంఘ సంస్కర్తగా కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్, యూత్ కాంగ్రెస్ నాయకులు బొంకూరి అవినాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజు, భూషణవేణి సురేష్ గౌడ్, కౌన్సిలర్ బొడ్డుపల్లి జగదీష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి టౌన్ : ఫూలే వర్ధంతిని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరావేన స్వప్నముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోంగాని శంకర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
పూలే సేవలు మరువలేనివి
కోల్‌సిటీ : జ్యోతిరావుఫూలే సేవలు మరువలేనివని రామగుండం మేయర్ మహంకాళిస్వామి అన్నారు. ఫూలేవర్ధంతి సందర్భంగా గోదావరిఖని రాజేష్ థియే టర్ చౌరస్తాలో ఉన్న ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ మాట్లాడుతూ ఫూలే అణగారిన వర్గాల కోసం ఎనలేని కృషిచేశారని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సాగి సంతోష్ రావు, దాసరి సాంబమూర్తి, అంబేద్కర్‌సంఘం నాయ కులు బొంకూరి మధు, కాంపెల్లి సతీష్, పంజ అశోక్ పాల్గొన్నారు.
ఎలిగేడు : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో శనివారం జ్యోతిరావు ఫూలే వర్ధంతిని నిర్వహించారు. జేఏసీ చైర్మన్ దాసరిఉష హాజరై ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీజేఏసీ సంక్షేమ సంఘం వర్కింగ్ చైర్మన్ నల్లవెల్లి శంకర్, మండల ఇంచార్జి గోసికి అక్షయ్, మీడియా ఇంచార్జి పాకాల వినయ్, శంకర్, సూర్య, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి..
కళ్యాణ్‌నగర్ : అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావుఫూలే చేసిన సేవలు మరువలేని వని రామగుండం మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా రాజేష్ థియేటర్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు, అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు ఫూలే దంపతులు చేసిన కృషి మరువరానిదన్నారు. కార్యక్రమంలో మురళీధర్‌రావు, మెతుకు దేవరాజు, తోకల రమేష్, నారాయణదాసు మారుతి, ప్రశాంత్, బుర్రి వెంకన్న పాల్గొన్నారు. మాల సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖనిచౌరస్తాలో నియోజక వర్గ అధ్యక్షులు మాలెం మధు ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సోగాల వెంకటి, అంజి, కడమండ శ్రీనివాస్, మొండి, నంది నరేష్, రామరాజు, ఆకాష్, వెంకటేష్, రాంకీ, శ్రీనివాస్, కొమురయ్య పాల్గొన్నారు.
ఓదెల : మండలంలోని గ్రామాల్లో జ్యోతిరావు ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఆయన చేసిన సేవను కొనియాడారు.పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.