Share News

Peddapalli: క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:31 AM

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కుంచాల సునీత అన్నారు.

Peddapalli:  క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ప్రధాన న్యాయాధికారి కుంచాల సునీత

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కుంచాల సునీత అన్నారు. గురువారం ప్రపంచక్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించు కొని జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీ గురుకుల బాలికల జూనియర్‌కళాశాలలో క్యాన్సర్‌ వ్యాధిపై అవ గాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె క్యాన్సర్‌ నిర్ధారణ, నివారణపై అవగాహన కల్పించారు. క్యాన్సర్‌ నివారణ చర్యలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటిని ఆచరించి తమ కుటుంబ సభ్యులకు కూడా తెలపాలన్నారు. విద్యార్థులకు అవసరమైన శానిటరీ నాప్కిన్లు అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. బాలికలు, మహిళలు ప్రతినెల స్వయంగా బ్రెస్ట్‌ స్ర్కీనిం గ్‌ చేసుకోవాలని, ఏమైనా లక్షణాలు కనిపిస్తే సమీపం లోని ప్రభుత్వవైద్య ఆసుపత్రిని సంప్రదించాలని తెలి పారు. వైద్యాధికారి భవాని మాట్లాడుతూ బరువు తగ్గ డం, తగ్గని దగ్గు, కంతులు పెరగడం, పరిమాణం పెరుగుతున్న గడ్డలు, దగ్గినప్పుడు, విసర్జన సమయంలో రక్తస్రావం లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుప త్రిలో పరీక్షలు చేయించుకోవా లన్నారు. కార్యక్రమంలో అధికారులు రాజమౌళి, లక్ష్మిభవాని, సంయుక్త లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు శ్రీనివాస్‌, బాలకృష్ణ, సంకీర్తన, కళాశాల ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి, తదితరులు పాలొ ్గన్నారు.

కోర్టు భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన..

ధర్మారం: మండ లంలోని నంది మేడారం జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు శాశ్వత భవన నిర్మాణానికి జిల్లా జడ్జి సునీత గురువారం స్థల పరి శీలన చేశారు. మేడా రంలో కోర్టు ఏర్పడిన నాటినుంచి అద్దెభవనంలో కొనసాగుతోంది. కోర్టుకు శాశ్వతభవనం నిర్మాణం కోసం మేడారం గ్రామంలోని మూడుస్థలాలను జిల్లా జడ్జి సునీత నందిమేడారం జడ్జి సరిత, తహసీల్దార్‌ దురిశేటి శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. మేడారం గ్రామంలోని అమరేశ్వరస్వామి గుడి సమీపంలోని పార్కుస్థలంతో పాటు, రైతు వేదిక సమీపస్థలాన్ని, పెద్దపల్లి రోడ్డులోని ఎస్‌సీ కమ్యూనిటి భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ మూడింటిలో భవన నిర్మాణానికి ఏ స్థలం అనుకూలమో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను జడ్జీ సునిత అదేశించారు. నిజానికి భవన నిర్మాణం కోసం గతంలోనే స్థలం కేటాయించినప్పటికి, ఆ ప్రాంతమంతా బండ రాళ్లతో నిండి ఉండడం, భవన నిర్మాణానికి ఎక్కువ మొత్తంలో నిధులు అవసరం పడుతుండడంతో గురువారం మరోసారి ఆయాస్థలా లను పరిశీలించారు.

Updated Date - Feb 06 , 2026 | 12:31 AM