Peddapalli: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:23 PM
సుల్తానాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద ్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు.
- డీసీపీ రాంరెడ్డి
సుల్తానాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద ్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. సుల్తానా బాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతి బాఫూలే, బీసీ గురుకుల విద్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి డీసీపీ రాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగు తున్న రోడ్డు ప్రమాదాల్లో వేలాదిమంది మృత్యువాతపడి ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని అన్నారు. ఇకముందు అలాంటి దుస్థితి రాకుండా వేగంకన్నా ప్రాణంమిన్న అనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. మీతల్లిదండ్రులు ద్విచక్రవాహనంతో బయ టకు వెళుతున్నపుడు మీరు వారికి హెల్మట్‌ను ఇవ్వా లని, కారులో వెలుతుంటే సీటుబెల్టు ధరించాలని గుర్తుచేయాలని సూచించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త లు వివరించారు. కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ జి సుబ్బారెడ్డి, ఎస్‌ఐ పి చంద్రకుమార్ పాల్గొన్నారు.
మైనర్ల డ్రైవింగ్ వల్ల ప్రాణ, ఆర్థిక నష్టాలు..
ఓదెల: మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణనష్టాలతోపాటు ఆర్థికనష్టాలు సంభవిస్తా యని పొత్కపల్లి ఎస్‌ఐ దీకొండరమేష్ తెలి పారు. అరైవ్.. అలైవ్‌లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో రోడ్డు భద్రతపై పాఠశాల విద్యార్థులకు అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ విద్యార్థులకు ట్రాఫిక్‌సిగ్నల్స్, హెల్మెట్ విని యోగంపై అవ గాహన కల్పించారు.
ధర్మారం: అరైవ్-అలైవ్‌లో భాగంగా ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ మండలకేంద్రంలోని బ్రిలియం ట్ హైస్కూల్‌లో బుధవారం రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తున్నప్పుటు హెల్మె ట్ ధరించడం, రోడ్డు క్రాస్‌చేసే విధానం, మూలమలుపుల వద్ద డ్రైవింగ్ ఎలాచేయాలి, బస్సు ఎక్కేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.
యైుటింక్లయిన్‌కాలనీ: బుధవారం గోదావరిఖని టూటౌన్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతా, ట్రాఫిక్‌నిబంధనలపై అవగాహన కల్పించా రు. తెలంగాణచౌరస్తాలో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థిదశ నుంచి ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన అవసరమని సీఐ ప్రసాదరావు అన్నా రు. కార్యక్రమంలో ఎస్సై అహ్మదుల్లా, ఏఎస్సై తిరు పతిరెడ్డి, పోలీస్‌సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.