Peddapalli: ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:19 AM
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సమానత్వానికి, వీరోచిత పోరాటానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
- కలెక్టర్ కోయశ్రీహర్ష
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సమానత్వానికి, వీరోచిత పోరాటానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి అదనపుకలెక్టర్ శ్రీరాములతోకలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాకలి ఐలమ్మను గుర్తింపు పొందిన తెలం గాణ ఉద్యమకారిణి, తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలిగా కొనియాడారు. కార్యక్రమంలో బీసీ జిల్లా సంక్షక్షేమ అధికారి రవీందర్, కలెక్టరేట్ పాలన అధికారి ప్రకాష్‌తోపాటు జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.