Share News

Peddapalli: ప్రతిఒక్కరూ చట్టాలను గౌరవించాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:18 AM

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): చట్టాల పట్ల పూర్తిస్థాయిలో తెలు సుకోవడంతోపాటు చట్టాలను గౌరవించా లని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిజ కోహిర్కర్‌ అన్నారు.

Peddapalli:  ప్రతిఒక్కరూ చట్టాలను గౌరవించాలి
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌జడ్జి శ్రీనిజ కోహిర్కర్‌

- సీనియర్‌ జడ్జి శ్రీనిజ కోహిర్కర్‌

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): చట్టాల పట్ల పూర్తిస్థాయిలో తెలు సుకోవడంతోపాటు చట్టాలను గౌరవించా లని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిజ కోహిర్కర్‌ అన్నారు. గురువారం మండలం లోని దేవుని పల్లి గ్రామంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌జడ్జి శ్రీనిజ కోహిర్కర్‌ హాజరై పలుచట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామాల్లో ఏవైనా గొడవలు జరిగితే 112 నంబర్‌ కాల్‌చేసి సమాచారం అందించాలన్నారు. యువత మత్తుపదార్థా లకు బానిసకాకుండా తల్లిదండ్రులు ప్రత్యేకదృష్టి పెట్టాలన్నారు. కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్‌ బొక్కల రేఖ-సంతోష్‌, న్యాయవాదులు ఝాన్సీ, నరేష్‌, పంచాయతీ కార్యదర్శి అఖిల పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 12:18 AM