Share News

Peddapalli: ప్రతీ ఓటరుకు ఓటరు స్లిప్‌ అందించాలి

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:29 AM

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు అందించాలని జిల్లా అదనపుకలెక్టర్‌ అరుణశ్రీ తెలిపారు.

Peddapalli:  ప్రతీ ఓటరుకు ఓటరు స్లిప్‌ అందించాలి

- అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు అందించాలని జిల్లా అదనపుకలెక్టర్‌ అరుణశ్రీ తెలిపారు. గురువారం రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌, అదనపుకలెక్టర్‌ అరుణశ్రీ ఎన్టీపీసీ, పీటీఎస్‌ కాకతీయ కళ్యాణ మండపంలో అంగన్‌వాడీ టీచర్లు, మెప్మా ఆర్‌పీలు, వార్డు అధికారులు, వార్డు అసిస్టెంట్‌లతో సమావేశం నిర్వహిం చారు. రామగుండం నగరపాలక సంస్థకు సరాసరి 7500మంది ఓటర్‌లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున మొత్తం 277 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటరు స్లిప్పు పంపిణీ చేసే సమయంలో పోలింగ్‌ కేంద్రం చిరునామా కూడా ఓటర్‌కు తెలపాలన్నారు. పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చే సమయంలో ఒరిజినల్‌ గుర్తింపుకార్డు తీసుకు రావాలని అవగాహన కల్పించాలన్నారు. ఓటరు స్లిప్పులను విధుల్లో ఉన్న సిబ్బంది మాత్రమే ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలన్నారు. పోలింగ్‌ శాతం పెరగడానికి ఓటరు స్లిప్పు కీలకమైందని, నిర్ణీతగడువులోగా పంపిణీపూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు పద్మజా రాణి, సుజాత,అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వ ర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, శిక్షకులు స్వరూప్‌ చంద్‌, కేడం శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, రెవెన్యూఆఫీసర్‌ఆంజనేయులు, రెవె న్యూఇన్‌స్పె క్టర్లు శంకర్‌రావు, ఖాజా, మెప్మాటీఎంసీ మౌనిక, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, సీవోలు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:29 AM