Share News

Peddapalli: ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారలే

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:22 AM

పెద్దపల్లి టౌన్‌, జూలై 1 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారిన పేదల గుడిసెల బతుకులు మాత్రం మారలేదని సీపీఐ జాతీయ నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు.

Peddapalli: ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారలే

-సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేన శంకర్‌

పెద్దపల్లి టౌన్‌, జూలై 1 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారిన పేదల గుడిసెల బతుకులు మాత్రం మారలేదని సీపీఐ జాతీయ నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు. సీపీఐ జిల్లాకార్యదర్శి తాండ సదానందం అధ్య క్షతన భారత కమ్యూనిస్టుపార్టీ సీపీఐ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో అర్హులైనపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయా లని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ముఖ్యఅతిథిగా కలవేనశంకర్‌ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు, స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. ఎలాంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గసభ్యుడు గోశిక, మోహన్‌, గౌతమ్‌ గోవర్ధన్‌, కనకరాజ్‌, సీపీఐ కార్పో రేటర్‌ మార్కాపూర్‌ సూర్య, కోడం స్వామి, లెనిన్‌, శేఖర్‌, ఎల్లయ్య, సాయి, తిరుమల, రమేష్‌, నవీన్‌, రేణిగుంట్ల ప్రీతం, మనోజ్‌ కుమార్‌, రాజయ్య, మోహన్‌, తోడుపునూరి రమేష్‌, కరీం పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:22 AM