Share News

Peddapalli: అర్హులైన ఓటర్లకు నష్టం కలుగకుండా చూడాలి

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:09 AM

మంథని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సర్‌ ప్రక్రియ సక్రమంగా జరిగేలా కాంగ్రెస్‌పార్టీ బీఎల్‌ఏలు పనిచేయాలి టీపీసీసీ ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచించారు.

Peddapalli:  అర్హులైన ఓటర్లకు నష్టం కలుగకుండా చూడాలి

టీపీసీసీ ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు

మంథని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సర్‌ ప్రక్రియ సక్రమంగా జరిగేలా కాంగ్రెస్‌పార్టీ బీఎల్‌ఏలు పనిచేయాలి టీపీసీసీ ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచించారు. ఆదివారం మంథనిలో వివిధ మండలా లకు చెందిన కాంగ్రెస్‌పార్టీ బీఎల్‌ఏలకు సర్‌ ప్రక్రియపై దుద్దిళ్ల శ్రీనుబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో గ్రామాల్లో అధికారులు నిర్వహించే సర్‌ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు నష్ట కల్గుకుండా కాంగ్రెస్‌పార్టీ బీఎల్‌ఏలు చూడాలన్నారు. ఓటర్ల తొలగింపులో అర్హులకు ఇబ్బందులు రాకుండా బీఎల్‌ఏలు పనిచేయాలన్నారు. పార్టీ పరంగా ప్రతిబీఎల్‌ఏకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషన్‌కాచే, డీసీసీ అధికార ప్రతినిధ సెగ్గెం రాజేష్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, ఆర్‌టీఏ మెంబర్‌ మంథని సురేష్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:09 AM