Peddapalli: ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలి
ABN , Publish Date - May 28 , 2026 | 12:24 AM
సుల్తానాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పారదర్శ కత, జవాబుదారీతనం పనిచేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పారదర్శ కత, జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ తహసీ ల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. పట్టణంలో నిర్మా ణం పూర్తయిన బాలసదనం, వృద్ధాశ్రమాలను కూడా సందర్శించారు. పలు విభాగాలను తనిఖీచేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ తహసీల్దార్ కార్యాలయంలో మధ్యవ ర్తులకు చోటులేదని ప్రజలు, రైతులు ఏ అవసరం వచ్చినా నేరుగా తహసీల్దార్‌ని కలిసి నేరుగా ఆయ నతో సమస్యచెప్పుకోవాలని అన్నారు. ఎంతమాత్రం దళారులను ఆశ్రయించవద్దన్నారు. మీ సేవా ద్వారా వివిధ ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చే దరఖాస్తులను సకాలంలో స్కూృటీని పూర్తి చేసి ప్రజలకు వేగవం తమైన సేవలు అందించాలని సూచించారు. బాల సదనం ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చిన్నారులకు సౌకర్యవంతమైన, సురక్షి తమైన వాతావరణం కల్పించాలని అన్నారు. వృద్ధాశ్ర మాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడివసతులు, ఆహా రం, పరిశుభ్రతపై అధికారులను, నిర్వాహకులను వివరాలు అడిగితెలుసుకున్నారు. వృద్ధులకు ఎలాంటి అసౌకర్యంకలుగకుండా సేవలు అందించాలని ఆదేశించారు. కలెక్టర్‌వెంట బీడబ్ల్యూవో వేణుగో పాల్, తహసీల్దార్‌బషీరొద్దిన్, అధికారులు పాల్గొన్నారు.