Peddapalli: ఖని జనరల్ ఆసుపత్రిలో పనిచేయని లిఫ్టు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:47 AM
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టు పని చేయకపోవడంతో రోగులు తీవ్రఇబ్బం దులు పడుతున్నారు.
- ఇబ్బంది పడుతున్న రోగులు
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టు పని చేయకపోవడంతో రోగులు తీవ్రఇబ్బం దులు పడుతున్నారు. ఆసుపత్రి నిర్వ హణ గాలికి వదిలేయడంతో రోగులు పరేషాన్ అవుతున్నారు. 15రోజులుగా లిఫ్టు పనిచేయకపోవడంతో రోగులు రెండవ అంతస్థులోని వార్డులకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతు న్నారు. ప్రసవం అయిన బాలింతలు, ఆపరేషన్లు అయిన రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. శుక్ర వారం ఓ మహిళకు మొదటి అంత స్థులో ఆపరేషన్ నిర్వహించి అనం తరం ఆమెను రెండవ అంతస్థు లోకి తీసుకురావడానికి అటెం డర్లు తీవ్రఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలోని లిఫ్టుఎప్పుడు పని చేస్తుందో తెలియని పరిస్థితి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గర్భిణులు ప్రస వం అయిన తరువాత పైకి తీసుకెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. ర్యాంపుద్వారా రోగులను తరలిస్తుండగా కొన్ని కొన్ని సందర్భాల్లో స్ర్టెచర్లు కిందకు జారుతుండడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సర్జికల్, ఆర్థోపెడిక్, జనరల్‌వార్డు మొదటి, రెండో అంతస్థులో ఉండ డంతో లిఫ్టు పనిచేయక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆసుపత్రిని పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో నెలల తరబడి లిఫ్టు పనిచేయక రోగులు తీవ్రఇబ్బందులు పడాల్సివస్తున్నది. ఇప్పటికైనా శాశ్వ తంగా లిఫ్టును మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని రోగులు, వారిసహాయకులు, ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు.