Peddapalli: ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:32 AM
కోల్‌సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పెద్దపల్లి డీసీపీ బూక్య రాంరెడ్డి నాయక్ సూచించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ రాంరెడ్డి
కోల్‌సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పెద్దపల్లి డీసీపీ బూక్య రాంరెడ్డి నాయక్ సూచించారు. గురువారం రాత్రి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి లోని సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలకు పటిష్టభద్రత తది తర అంశాలను పోలీస్ అధికారులతో చర్చించారు. పోలింగ్ స్టేషన్లకు వచ్చే ఓటర్లకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని శాఖలను సమన్వయం చేయాలని సూచించారు. ఆయనవెంట గోదావరిఖని ఏసీపీ మడతరమేష్, వన్‌టౌన్‌సీఐ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.