Peddapalli: ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:27 AM
సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మున్సిపల్ ఎన్నికల వ్యయపరిశీలకులు బి నరేష్, ముపాసిర్ అహ్మద్ స్పష్టం చేశారు.
- ఎన్నికల వ్యయ పరిశీలకులు
సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మున్సిపల్ ఎన్నికల వ్యయపరిశీలకులు బి నరేష్, ముపాసిర్ అహ్మద్ స్పష్టం చేశారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో గురువారం అభ్యర్థులందరితో ఏర్పాటు చేసిన సమావేశంలలో వారు మాట్లాడుతూ ఎన్నికలలో పోటీచేస్తున్న వారు తమ ఎన్నికలఖర్చు ఎలా నమోదు చేయాలన్న విషయంపై అభ్యర్థులకు అవగాహణ కల్పించారు. ఈమేరకు ఎన్నికల నియామావళికి సంబంధిం చిన బుక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ అభ్యర్థి ఎన్నికల ఖర్చుకోసం ప్రారంభించిన కొత్త బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే ఖర్చుచేయాలని, ఖర్చును వెంటవెంటనే నమోదు చేస్తూ అవసరమైనపుడు ఎన్నికల అధికారులకు చూపాల్సి ఉంటుం దన్నారు. ఎన్నికలు పూర్తయిన 45రోజులలో మొత్తం ఖర్చు వివరాలను ఎన్నికల అధికారులకు అందజేయాలన్నారు. లేనిచో వారిని ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారన్నారు. సమావేశంలో పలు వురు ఎన్నికల రిటర్నింగ్ అఽధికారులతోపాటు అసిస్టెంట్ డిస్ట్రిక్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమీషనర్ టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అందుబాటులో పోస్టల్ బ్యాలెట్..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్స్‌ను వినియోగించుకనే వారు శుక్రవారం నుంచి ఈనెల 8వరకు పురపాలక సంఘం కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్లు అందుబాటులో ఉంటాయని కమిషనర్ రమేష్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు వీటిని పొందాలన్నారు.