Peddapalli: మున్సిపల్‌లో ఎన్నికల సందడి షురూ
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:31 PM
మంథని, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మంథని మున్సిపాలి టీలో ఎన్నికల నిర్వాహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- ఓటర్ల జాబితా విడుదల
- 5వ తేదీ అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం
- అభ్యంతరాల, ఆక్షేపణల స్వీకరణలు
- పోలింగ్ స్టేషన్ల్ గుర్తింపు, ఏర్పాట్లు..
మంథని, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మంథని మున్సిపాలి టీలో ఎన్నికల నిర్వాహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గురువారం మంథని మున్సిపల్ పరిధి లోని 13వార్డుల్లో ఉన్న ఓటర్ల జాబితాను కమిషనర్ మనోహర్, ఉద్యోగులు విడుదల చేశారు. వార్డుల వారి గా విడుదలచేసిన జాబితాను మున్సి పల్‌తోపాటు ఆర్డీవో, తహశీల్దార్, ఎంపీడీవోతోపాటు ఇతర ముఖ్య కార్యాలయాల వద్ద బహిరంగంగా ప్రదర్శించారు. 13 వార్డులో విడుదల చేసిన ఓటర్ల జాబి తాల్లో ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో స్వీకరిస్తామని కమిషనర్ మనోహర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 5న ఉదయం 11గంటలకు అన్ని రాజకీయ పార్టీల పట్టణ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో సైతం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలో ఎలాంటి అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. మున్సి పల్ పరిధిలోని 13వార్డుల్లో 14,414మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. వారిలో 6,955మంది పురుషులు, 7,458మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 13వార్డులకు సంబంధించి ఎన్నికల నిర్వాహణకోసం పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటుపై అధికా రులు కసరత్తు చేశారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఓటర్లలిస్టును ఫైనల్ చేయనున్నారు. మున్సిపల్‌ఎన్నికలకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేస్తుండటంతో వివిధవార్డుల్లో, మున్సిపల్‌లో అన్నిపార్టీల్లోచైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లకుపోటీచేసే ఆశావహుల్లో సందడి మొదలైంది.
కోల్‌సిటీలో ఓటర్ల ముసాయిదా
జాబితా ప్రకటన..
కోల్‌సిటీ : ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో గురు వారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), రామ గుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ ఈ ముసాయిదా జాబితాను విడుదల చేశారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను నోటీసుబోర్డులో ప్రద ర్శించారు. దీనిపై అభ్యంతరాలను ఈనెల 5న ఉదయం 11గంటల వరకు స్వీకరిస్తారు. రామగుండం నగరపాలకసంస్థలో మొత్తం ఓటర్లు 1,82,976ఉండగా పురుషులు 91,395, మహిళలు 91,555, ఇతరులు 30మంది ఉన్నారు. నగరపాలక సంస్థలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. 156మంది మహళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నారు. మొత్తం 60డివిజన్ల ఓటర్ల జాబి తాను ప్రదర్శించారు. కార్యక్రమంలో అదనపు కమి షనర్ మారుతిప్రసాద్, సెక్రటరీ ఉమా మహేశ్వ ర్‌రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆర్‌ఓ ఆంజనేయులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌లో..
సుల్తానాబాద్ : మున్సిపల్ ఎన్నికల తంతులో భాగంగా గురువారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ టి రమేష్ మాట్లాడుతూ ఓటరు ముసాయిదాలో ఎటు వంటి అభ్యంతరాలు ఉన్నా లిఖిత పూర్వకంగా స్వీకరిస్తామన్నారు. వాటిని త్వరగా పూర్తి చేస్తామ న్నారు. ఓటరు విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం నుంచి ఈనెల 4 వరకు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంగల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల ప్రదర్శనలో టౌన్ ప్లానింగ్ అధికారి తిరుపతమ్మ, మున్సిపల్ మేనేజర్ అలీమొద్దిన్ తదితరులు ఉన్నారు.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
పెద్దపల్లి టౌన్ : మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్లతో కలిసి అభ్యంతరల స్వీకరణ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రదర్శించారు. పురుషులు 21693, స్త్రీలు 22150 ఇతరులు 2 మొత్తం ఓటర్లు 43845 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్,కిరణ్, మున్సి పల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, అకౌంటెంట్ నాగవేణి, ఆఫీసర్లు పాల్గొన్నారు.