Share News

Peddapalli: గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి కృషి

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:36 AM

ఓదెల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొలనూర్‌లో కొన్ని ఏళ్ల నుంచి అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

 Peddapalli:  గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి కృషి

- కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష

ఓదెల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొలనూర్‌లో కొన్ని ఏళ్ల నుంచి అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 99రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో నిర్వహిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి జీపీ నిధులు ఖర్చు చేసుకోమని తెలపడంతో సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామా భివృద్ధికి నిధులు ఖర్చు అవుతున్నాయని, అదనంగా కార్యాలయ నిర్మాణానికి కేటాయించలేమని సర్పంచ్‌ పల్లె కనకయ్య తెలిపారు. దీంతో నిధుల కేటా యింపు విషయంలో కృషి చేస్తానని కలెక్టర్‌ తెలిపారు. గ్రామపంచాయతీని పరిశీలించిన అనంతరం రోడ్డు విస్తరణకు మూలమలుపు వద్ద ఆటంకంగా ఉన్న భవన నిర్మాణంపై కలెక్టర్‌ ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయంపై గ్రామస్థులు పలువిషయాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం తో భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పల్లె కనకయ్య, ఢిల్లీ శంకర్‌, బైరి రవీందర్‌గౌడ్‌, బొంగోని రాజయ్య, సామ తిరుపతి, పాకాల సంపత్‌ రెడ్డి, జక్కుల మధు, దొడ్డే శంకర్‌, కొల్లూరి చందు తదితరులు పాల్గొన్నారు.

మంచి పోషకాహారం అందించాలి..

కాల్వశ్రీరాంపూర్‌ : విద్యార్థులకు మంచి పోషకాహారం అందించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టర్‌ మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేసి, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేశారు. తరగతి గదులు, డైనింగ్‌ హాల్‌, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, తది తర సౌకర్యాలపై ఆరాతీశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పోషకాహారం అందేలా చూడాలని అన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:36 AM