Peddapalli: కనీస విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:11 AM
పెద్దపల్లి కల్చరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పిల్లల్లో కనీసవిద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషిచేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి కల్చరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పిల్లల్లో కనీసవిద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషిచేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంచేలా మండల విద్యాధి కారు లు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు దృష్టిసారించా లని అన్నారు. విద్యాశాఖజిల్లా ఉన్నతాధి కారులు నిర్వహించే తనిఖీలు, తీసుకునే రివ్యూ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో నమోదు చేయాలన్నారు. పాఠశాలల తనిఖీలు సక్రమంగా ఉండాలని, చెక్‌లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించి పాఠశాల పర్యట నకు సంబంధించిన రిపోర్టు తయారు చేయాల న్నారు. పిల్లల విద్యాప్రమాణాలు సరిగాలేకున్నా అంతా బాగుందని చూపేట్టెందుకు తప్పుడు వివ రాలు అందిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రాథమిక విద్య మిడ్‌లైన్ చెకింగ్‌లో పెద్దపల్లి జిల్లా 17వస్థానం లో ఉందన్నారు. ఈనెల31, ఫిబ్రవరి 5,23నాడు మూడుసార్లు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కనీస విద్యాప్రమాణాలపై మాక్‌టెస్ట్ నిర్వహిం చాలన్నారు. ప్రతిరోజు రెండునుంచి మూడు గంటల వరకు పిల్లల రీడింగ్ స్కిల్స్, గ్రహణశక్తి పెంచేలా కార్యచరణ చేసుకోవాలని తెలిపారు. 6నుంచి 7వ తరగతి పిల్లలకు బేసిక్ ఉండేలా ప్రతిరోజు గంట సమయం స్పెషల్‌క్లాస్ ఏర్పాటు చేయాలన్నారు. 8,9 తరగతి విద్యార్థులను సైతం శ్రద్ధపెట్టి, వారి పరిజ్ఞానం పెరిగేలా చూడాలన్నారు. సంక్రాంతి కంటే ముందు గానే 10వతరగతి సిలబస్ పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మాని టరింగ్ అధికారులు షేక్, మల్లేశం, జీసీడీవో కవిత, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
ఫ 123 సీనియర్
సిటిజన్ కేసులు
పరిష్కారం..
జిల్లాలో 123సీనియర్ సిటిజన్ కేసులను పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. గురువారం ఆయన మీడియాకు ఇచ్చిన నివేదికలో పలు అంశాలను తెలిపారు. వయోవృద్ధులు ముందుగా తమ ఫిర్యాదులను ఆర్డీవో కార్యాలయంలో అందించా లన్నారు. తల్లిదండ్రులను వారి పిల్లలు పట్టించకోని సందర్భంలో చట్టప్రకారం చర్యలు తీసుకుం టామని పేర్కొన్నారు. 152మంది వృద్ధులు వారి పోషణను పిల్లలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా, వాటిని విచారించామన్నారు. మరో 29ఫిర్యా దులు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. ఆదేశాలు పాటించని పిల్లలకు వారసత్వంగా వచ్చే ఆస్తిని తల్లిదండ్రులకు మార్పు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవోవద్ద సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.