Peddapalli: మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుడి బాధ్యత
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:07 AM
అంతర్గాం(పాలకుర్తి), జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల కేంద్రంలో గురువారం మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై, షీటీమ్ అంది స్తున్న సేవలపై స్థానికప్రజలకు పోలీసులు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు.
- పెద్దపల్లి డిసీపీ భూక్యా రామ్‌రెడ్డి
అంతర్గాం(పాలకుర్తి), జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల కేంద్రంలో గురువారం మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై, షీటీమ్ అంది స్తున్న సేవలపై స్థానికప్రజలకు పోలీసులు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దపల్లి డీసీపీ భూక్యరామ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానంగా కళాశాలల్లో విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్‌వలన కలిగే దుష్బ్రభావాలను వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిపౌరుడిపై ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసు లకు సహకారం అందించాలన్నారు. మాదకద్రవ్యాలపై ఎటువంటి సమాచారం తెలి సినా డయల్ 100,1908 ఫ్రీ నంబర్‌కు సమా చారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ మడత రమేష్, సీఐ టి ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ బి వెంకటేష్, గ్రామస్థులు, యువత, మహిళలు పాల్గొన్నారు.