Share News

Peddapalli: రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటి చూపే ప్రధానం: సీపీ

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:51 AM

కోల్‌సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటిచూపు కీలకపాత్ర పోషిస్తుం దని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా అన్నారు.

Peddapalli:  రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటి చూపే ప్రధానం: సీపీ

కోల్‌సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటిచూపు కీలకపాత్ర పోషిస్తుం దని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా అన్నారు. అరైవ్‌,అలైవ్‌ రెండో విడత కార్యక్రమంలో భాగంగా లయన్స్‌క్లబ్‌ సహకారంతో శుక్రవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో డ్రైవర్లకోసం ప్రత్యేక కంటి వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనదారుల భద్రతకు పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. రోజువారి విధుల్లో వాహనాలు నడిపే పోలీస్‌ డ్రైవర్లకు స్పష్టమైన కంటి చూపు అవసరమైనందున ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సిబ్బంది ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా కంటిచూపును పరీక్షించుకోవాలన్నా రు. ఏమైనా సమస్యలుంటే పోలీస్‌ డ్రైవర్లకు పోలీస్‌శాఖ తరపున పూర్తిసహకారం అందిస్తామని చెప్పారు. వైద్య శిబిరానికి సహకరించిన లయన్స్‌క్లబ్‌ వైద్యులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఉచితంగా డ్రైవర్లకు అద్దాలను అందజేయడంతో పాటు అధిక స్థాయి కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి మెరుగైనవైద్యం ప్రత్యేకకంటి ఆసు పత్రికి రెఫర్‌చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) శ్రీనివాస్‌, ఏవో శ్రీనివాస్‌, డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, ఆర్‌ఐలు శేఖర్‌, పెద్దన్న,మల్లేష్‌, సీసీహరీష్‌, లయన్స్‌క్లబ్‌ రీజినల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌, జోన్‌ చైర్మన్‌ రాజేందర్‌, గుగ్గిళ్ల రవీంద్రచారి పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై అవగాహన..

సుల్తానాబాద్‌: పట్టణంలోని శాస్త్రినగర్‌ ప్రాంతంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అరైవ్‌-అలైవ్‌ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లారీడ్రైవర్లకు ఉచితకంటి పరీక్షల శిబిరం శుక్రవారం సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో డ్రైవర్ల ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో దూరప్రయాణాల్లో కంటి చూపు సరిగ్గా ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. డ్రైవర్లు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శిబిరంలో పలువురు లారీ డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు.

కోల్‌సిటీ: అరైవ్‌,అలైవ్‌కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని ట్రాఫిక్‌పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచితకంటి, బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహిం చారు. లయన్స్‌క్లబ్‌ సహకారంతో పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు ఈ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బీ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:51 AM